రిగ్గింగును అడ్డుకున్నారని దాడి | - | Sakshi
Sakshi News home page

రిగ్గింగును అడ్డుకున్నారని దాడి

Nov 6 2026 2:32 AM | Updated on Nov 6 2026 2:32 AM

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: రిగ్గింగ్‌ను అడ్డుకున్నారన్న కోపంతో టీడీపీ నేతలు దాడులకు దిగారు. బత్తలపల్లి మండలం మాల్యవంతంలోని రెండు పోలింగ్‌ కేంద్రాల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేస్తున్నట్లు సమాచారం అందడంతో జెడ్పీటీసీ అభ్యర్థి చల్లా మమత భర్త కోటి సురేష్‌ అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు ఏం చేయలేకపోయారు. ఈ లోగా పోలింగ్‌ నుంచి బయటకు వచ్చిన టీడీపీ నాయకులు కోటి సురేష్‌బాబుపై దాడికి సిద్ధమయ్యారు. దీంతో ఆయన పోలీసులను రక్షణ కోరారు. ఈ క్రమంలోనే సీఐ ప్రభాకర్‌గౌడ్‌ తన వాహనంలో సురేష్‌ను తీసుకు వెళ్తుండగా...పచ్చమూక సీఐ వాహనంపై రాళ్ల దాడి చేసింది. దీంతో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న కొందరు వైఎస్సార్‌ సీపీ నేతలు కోటి సురేష్‌ను ద్విచక్రవాహనంలో బత్తలపల్లికి తీసుకువెళ్లారు. దీంతో తిరిగి మాల్యవంతం చేరుకున్న పచ్చమూక ఆ సమయంలో ఓటు వేయడానికి వచ్చిన వెంకటగారిపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. అనంతరం వెంకటగారిపల్లి గ్రామస్తులు ఇళ్లకు వెళ్లిపోగా, వారి వెనుకే వెళ్లిన టీడీపీ నాయకులు వారి ఇళ్లల్లోకి దూరి అడ్డు వచ్చిన వారిపై దాడులకు దిగారు. ఈ దాడుల్లో వైఎస్సార్‌సీపీ నేతలు కురుబ నారాయణస్వామి, వడ్డె కృష్ణయ్య, దివ్యాంగుడైన రామాంజనేయులు, అశోక్‌, గణేష్‌ గాయపడ్డారు. వీరిలో కురుబ నారాయణస్వామి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో ఆసుపత్రులకు తరలించారు. ధర్మవరం డీఎస్పీ జగన్నాథరాజు, ధర్మవరం రూరల్‌ సీఐ ప్రభాకర్‌గౌడు సిబ్బందితో పరిస్థితిని సమీక్షించారు. వెంకటగారిపల్లిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, వైఎస్సార్‌సీపీ నాయకులే తమపై దాడి చేశారని టీడీపీ నేతలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

మాల్యవంతంలో జెడ్పీటీసీ అభ్యర్థి

భర్తపై దౌర్జన్యం

వెంకటగారిపల్లిలో వైఎస్సార్‌సీపీ

నాయకుల ఇళ్లల్లోకి చొరబడి దాడులు

తీవ్రంగా గాయపడిన కురుబ

నారాయణస్వామి.. పరిస్థితి విషమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement