ధర్మవరం రిసెప్షన్‌ కేంద్రం తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ధర్మవరం రిసెప్షన్‌ కేంద్రం తనిఖీ

Nov 6 2026 2:32 AM | Updated on Nov 6 2026 2:32 AM

ధర్మవరం అర్బన్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధుల విధులకు వెళ్లి వచ్చే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని జేసీ మౌర్య భరద్వాజ్‌ అధికారులను ఆదేశించారు.గురువారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ కేంద్రాన్ని జేసీ తనిఖీ చేశారు. రిసెప్షన్‌ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బందికి కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల విధులను ముగించుకొని వచ్చిన సిబ్బంది రిపెప్షన్‌ కేంద్రంలో అందజేయాల్సిన నివేదికలు, బ్యాలెట్‌ బాక్సులకు సంబంధించి చేసిన ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల విధులకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామభూపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ దేవరాజ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

రివాల్వర్‌తో

హోంగార్డు హల్‌చల్‌

చిలమత్తూరు: హిందూపురం హోంగార్డు నవీన్‌ రివాల్వర్‌తో పోలింగ్‌ కేంద్రం వద్ద హల్‌చల్‌ చేయడం చర్చనీయాంశమైంది. నవీన్‌ గురువారం చిలమత్తూరు జెడ్పీహెచ్‌ఎస్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఎన్నికల విధులకు హాజరయ్యాడు. అయితే ఆయన ప్యాంట్‌ పైభాగంలో సినిమాటిక్‌ స్టైల్‌లో రివాల్వర్‌ ఉంచుకోవడాన్ని చూసి ఓటర్లు భయభ్రాంతులకు గురయ్యారు. ఎస్‌ఐ, సీఐ స్థాయి వ్యక్తులు వాడాల్సిన రివాల్వర్‌..హోంగార్డు వద్ద ఎలా ఉందని చర్చ జరిగింది. సదరు హోంగార్డు డీఎస్పీ రవిబాబు వద్ద పనిచేస్తారని పోలీసులు చెప్తుండగా.. ప్రజలు మాత్రం ఇది అధికార దుర్వినియోగానికి నిదర్శనమని చెప్పుకుంటున్నారు. ఉన్నతాధికారి వద్ద ఉండాల్సిన రివాల్వర్‌.. హోంగార్డు వద్దకు ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఓటు స్ఫూర్తికి ‘వంద’నం

పుట్టపర్తి అర్బన్‌: మండలంలోని బొంతలపల్లికి చెందిన వందేళ్ల వయసున్న సత్తెమ్మ గురువారం పరిషత్‌ ఎన్నికల్లో ఓటేసి ఆదర్శంగా నిలిచారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యుడు తోపుడు బండిపై తీసుకువచ్చి ఓటు వేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement