పుట్టపర్తి అర్బన్/ ధర్మవరం అర్బన్: ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర స్థాయి వైద్య అధికారుల బృందం ఆదేశించింది. గురువారం పుట్టపర్తిలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వైద్య బృందంలో హెచ్‌డబ్ల్యూసీ స్టేట్ జాయింట్ డైరెక్టర్ నరసింహనాయక్, రాష్ట్ర సమన్వయకర్త పీవీ కిరణ్, బయో మెడికల్ ఇంజినీర్ రమేష్, కమ్యూనిటీ ప్రాసెస్ మేనేజర్ సురేష్ ఉన్నారు. వారు మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై ఆరాతీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలు, సాధన, వైద్య సేవల నాణ్యతపై ఆరాతీశారు. అనంతరం అక్కడి నుంచి జిల్లాలోని పలు పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలను బృందం సభ్యులు పరిశీలించారు. ధర్మవరం ఏరియా ఆస్పత్రి, సాయినగర్ యూపీహెచ్‌సీ, చెన్నేకొత్తపల్లి, బత్తలపల్లి, పోతుకుంట, పీహెచ్‌సీలు, మార్గమధ్యంలోని విలేజ్ హెల్త్ క్లినిక్‌లను వైద్యబృందం సందర్శించింది. అక్కడ వైద్య సేవలు, రికార్డులు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య కార్యక్రమాల అమలుతీరును అడిగి తెలుసుకుంది. అర్బన్ హెల్త్‌సెంటర్లు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో ప్రయోగశాల పరీక్షలు, మందుల లభ్యత, వ్యాధి నిరోధక టీకా, ఆరోగ్య సేవలపై వివరాలపై ఆరాతీశారు. అనంతరం హిందూపురంలోని జిల్లా ఆస్పత్రిని సందర్శించింది. కార్యక్రమంలో డీపీఎంఓ డాక్టర్ పద్మజ, ఎన్‌టీఆర్ వైద్య సేవల నోడల్ ఆఫీసర్ శ్రీదేవి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శ్రీకాంతి, జిల్లా మలేరియా నివారణాధికారి చెన్నారెడ్డి, 104 నోడల్ ఆఫీసర్ పద్మజ, ధర్మవరం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ భాగ్యలక్ష్మి, పీఓ సునీల్, ఎస్‌ఓ కళాధర్, సీహెచ్‌ఓ వన్నప్ప, డీపీహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, డెమో సుబ్రమణ్యం, వివిధ ఆస్పత్రుల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆయుస్మాన్ ఆరోగ్య కేంద్రం తనిఖీ
ధర్మవరం రూరల్: ధర్మవరం మండలం పోతుకుంటలోని ఆయుస్మాన్ ఆరోగ్య మందిర్‌ను రాష్ట్ర వైద్య బృందం సభ్యులు గురువారం తనిఖీ చేసింది. ఆరోగ్య మందిర్‌లో ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీసింది. దర్శనమల డాక్టర్ పుష్పలత, ఎన్‌హెచ్‌ఎం స్టాప్ శ్రీనివాసరెడ్డి, హెల్త్ సూపర్‌వైజర్ రాజశేఖర్‌రెడ్డి, ఎంఎల్‌హెచ్‌పీ గౌతమి తదితరులు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో
నాణ్యత ప్రమాణాల పెంపే లక్ష్యం
బత్తలపల్లి: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలను మరింత పెంచడమే లక్ష్యమని రాష్ట్ర వైద్య బృందం సభ్యులు తెలిపారు. గురువారం వైద్యాధికారుల బృందం పీహెచ్‌సీని సందర్శించింది. ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
కార్యక్రమంలో డీపీఎంఓ పద్మజ, డీపీఓ నాగరాజు, వైద్యాధికారులు అరుణ్‌కుమార్, విష్ణువర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి వైద్య అధికారుల బృందం


