ఏకపక్షంగా పోలీసుల తీరు | - | Sakshi
Sakshi News home page

ఏకపక్షంగా పోలీసుల తీరు

Nov 6 2026 2:32 AM | Updated on Nov 6 2026 2:32 AM

కదిరి అర్బన్‌: కదిరి మండలం పట్నం జెడ్పీ హైస్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రంలో కదిరికి చెందిన టీడీపీ నాయకులు కాటం మనోజ్‌తో పాటు మరికొంత మంది క్యూలో ఉన్న ఓటర్లను సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని ఒత్తిడి తెచ్చారు. విషయం తెలుసుకున్న వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థి, కదిరి జెడ్పీటీసీ అభ్యర్థి వజ్ర భాస్కర్‌రెడ్డి అక్కడకు చేరుకుని సీఐ నిరంజన్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఇతర ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలను పోలింగ్‌ కేంద్రంలోనికి ఎలా పంపుతున్నారని ప్రశ్నించారు. దీంతో పోలీసులు మనోజ్‌ను అక్కడినుంచి పంపించేశారు. ముత్యాలచెరువు పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపి దొంగ ఓట్లు వేసుకున్నారు. వజ్ర భాస్కర్‌రెడ్డి పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని ఏజెంట్లను తీసుకువెళ్లి కేంద్రంలో కూర్చోబెట్టారు. అప్పటికే టీడీపీ నాయకులు భారీగా ఓట్లు వేసుకున్నారు. అమెరికాలో ఉన్న వి.ధీరజ్‌రెడ్డి అనే వ్యక్తి ఓటు సైతం టీడీపీ నాయకులే వేసేశారు. కదిరి మండలం కొండమనాయునిపాళెం గ్రామంలోని పోలింగ్‌ బూత్‌లో టీడీపీ నాయకులు దొంగ ఓట్లు వేశారు.

● మడకశిర మండలంలోని గుండుమలలో పోలింగ్‌ ఏక పక్షంగా సాగింది. 20, 21, 22వ పోలింగ్‌ బూత్‌లలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండానే పోలింగ్‌ జరిగింది. దీంతో గుండుమల పంచాయతీలో ఎన్నికలను వైఎస్సార్‌సీపీ బహిష్కరించారు. మణూరులో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి వైఎస్సార్‌సీపీకి పోలింగ్‌ ఏజెంట్లను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించగా..కూటమి నాయకులు భారీగా దొంగ ఓట్లు వేసుకున్నారు. మడకశిర మండలం మెళవాయిలో కూడా వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై కూటమి నాయకులు దాడికి ప్రయత్నించారు.

● అగళి మండలంలోని ఆర్‌జీపల్లి పరిధిలోని రాగేలింగనహళ్లి–1 పోలింగ్‌ కేంద్రంలో మృతి చెందిన సిద్ద గంగప్ప ఓటును టీడీపీ కార్యకర్త వేశాడు. అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు వెంటనే అభ్యతరం చేయడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement