నల్లచెరువులో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

నల్లచెరువులో ఉద్రిక్తత

Nov 6 2026 2:26 AM | Updated on Nov 6 2026 2:26 AM

● వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి,

పోలింగ్‌ ఏజెంట్లపై దాడికి యత్నం

● పోలింగ్‌ కేంద్రం వద్ద ‘జై పరిటాల’ అంటూ నినదించిన పచ్చమూక

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: పరిషత్‌ ఎన్నికల సందర్భంగా గురువారం నల్లచెరువు మండలంలో ‘పరిటాల’ అనుచరులు రెచ్చిపోయారు. పోలింగ్‌కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. నల్లచెరువు జిల్లా పరిషత్‌ పాఠశాలలోని పోలింగ్‌ బూత్‌ల వద్దకు వచ్చిన అగంతకులు ‘జై పరిటాల శ్రీరాం’ అంటూ నినాదాలు చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. వీరిలో కొందరు దొంగఓట్లు వేసేందుకు ప్రయత్నించగా..వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు అడ్డుకున్నారు. దీంతో పరిటాల బ్యాచ్‌ రెచ్చిపోయింది. నల్లచెరువు–1 ఎంపీటీసీ అభ్యర్థి భర్త ఆనంద్‌రెడ్డి, పోలింగ్‌ ఏజెంట్‌ సూర్య శేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డిపై దాడికి యత్నించి పోలింగ్‌ కేంద్రాల వద్ద భయానక వాతావరణాన్ని సృష్టించింది. పచ్చగూండాలు నల్లచెరువులో అలజడి సృష్టించినా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి రవికుమార్‌రెడ్డిని మాత్రం పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. పోలింగ్‌ కేంద్రం బయటే ఉండాలంటూ ఆంక్షలు విధించారు. పరిటాల బ్యాచ్‌ను కట్టడి చేయలేని పోలీసులు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అరెస్ట్‌చేసి కదిరి డీఎస్పీ కార్యాలయానికి తరలించారు.

దొంగఓట్లకు చిలకం ప్లాన్‌ !

పుట్టపర్తి అర్బన్‌: పుట్టపర్తి జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీపడుతున్న జనసేన నేత చిలకం మధుసూదన్‌రెడ్డి ధర్మవరం నుంచి పెద్ద ఎత్తున నాయకులను, కార్యకర్తలను దింపి రిగ్గింగ్‌ చేయించడానికి విఫలయత్నం చేశారు. దొంగఓట్లు వేయించేందుకు ప్రయత్నించగా.. కార్లలో వచ్చిన కొత్త వ్యక్తులను గమనించిన వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఏవీ రమణారెడ్డి వారితో వాగ్వాదం చేసి పోలీసుల సహకారంతో అక్కడి నుంచి పంపించి వేశారు. ఇక పెడపల్లిలో గ్లాసు గుర్తుకు ఓటేయాలని చిలకం అభ్యర్థించగా, స్థానికులు గట్టిగా బుద్ధి చెప్పి పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement