ముదిగుబ్బలో యథేచ్ఛగా రిగ్గింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ముదిగుబ్బలో యథేచ్ఛగా రిగ్గింగ్‌

Nov 6 2026 2:26 AM | Updated on Nov 6 2026 2:26 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: పరిషత్‌ ఎన్నికలను కూటమి నాయకులు అపహాస్యం చేశారు. ముదిగుబ్బ జెడ్పీటీసీ అభ్యర్థి, బీజేపీ నాయకుడు ఆదినారాయణ యాదవ్‌ తన అనుచరులతో కలిసి మండలంలోని కొండగట్టుపల్లిలో ఉదయాన్నే సీసీ కెమెరాలను ఆఫ్‌ చేయించి రిగ్గింగ్‌ చేశారు. అలాగే సాయంత్రం ముదిగుబ్బ ప్రభుత్వ బాలుర హైస్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లిన ఆదినారాయణ యాదవ్‌, టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి చెందిన తుమ్మల నాయుడుతో కలిసి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను, అధికారులను భయపెట్టి రిగ్గింగ్‌ చేశారు. బీజేపీ, టీడీపీ నాయకులు రిగ్గింగ్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ముదిగుబ్బ ఎంపీటీసీ–1 వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి చండ్రాయుడుతో పాటు వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోలింగ్‌ కేంద్రం వద్ద ఆందోళనలకు దిగారు. రీపోలింగ్‌ చేపట్టాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు. అలాగే గాండ్లవారిపల్లి బూత్‌ నంబర్‌ 62లోకి అనుచరులతో కలిసి ప్రవేశించిన బీజేపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఆదినారాయణ వైఎస్సార్‌సీసీ ఏజెంట్లపై దాడి చేసి పోలింగ్‌ ముగిసే వరకు స్టేషన్‌లోనే కూర్చోబెట్టారు.

వీడియోలో స్పష్టంగా దృశ్యాలు

రీ పోలింగ్‌ నిర్వహించాలని

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement