రోడ్డు ప్రమాదంలో బ్యాంక్‌ ఆఫీసర్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బ్యాంక్‌ ఆఫీసర్‌ దుర్మరణం

Aug 8 2026 12:59 AM | Updated on Aug 8 2026 12:59 AM

రామగిరి: మండలంలోని ఎగువపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్యాంక్‌ అధికారి చిగిచెర్ల నాగార్జున (29) శుక్రవారం మృతి చెందాడు. గ్రామస్తులు, బ్యాంక్‌ అధికారులు తెలిపిన వివరాలమేరకు... ఆత్మకూరు మండలం వడ్డుపల్లికి చెందిన నాగార్జున పేరూరు ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణబ్యాంక్‌లో సెకెండ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ఫీల్డ్‌ ఆఫీసర్‌గా సాయిచంద్ర పనిచేస్తున్నారు. ఇద్దరూ ద్విచక్ర వాహనంలో ఎన్‌ఎస్‌ గేట్‌లోని బ్రాంచ్‌కు నగదును అందజేసి పేరూరుకు తిరిగి వస్తున్నారు. అయితే మార్గమధ్యలో ఎగువపల్లి సమీపంలో ముందు వెళ్తున్న ఆటోను తప్పించబోయి బైక్‌ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలైన నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. ఫీల్డ్‌ ఆఫీసర్‌ సాయిచంద్ర తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement