హోరా హోరీగా క్రీడా పోటీలు | - | Sakshi
Sakshi News home page

హోరా హోరీగా క్రీడా పోటీలు

Aug 12 2026 3:22 AM | Updated on Aug 12 2026 3:22 AM

హిందూపురం: మండలంలోని కె.బసవనపల్లి జెడ్పీ హైస్కూల్‌లో అమరావతి చాంపియన్‌షిప్‌ –2026 జిల్లాస్థాయి పోటీలు హోరాహోరీగా జరిగాయి. వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకాలను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు డిస్ట్రిక్‌ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ కిషోర్‌ పేర్కొన్నారు. మంగళవారం 40 మంది పీడీల పర్యవేక్షణలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ చూపిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశామని కిశోర్‌ పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, హెచ్‌ఎంలు రవీంద్రరెడి, పీడీలు సురేష్‌ కుమార్‌, అరుణా, మాజీ స్కూల్‌ గేమ్స్‌ సెక్రెటరీ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement