పుట్టపర్తి: జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్) ఫలితాల్లో ఎంపికై న విద్యార్థుల మెరిట్ కార్డులను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ ఏడీ లాజరు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్‌సైట్ www. bse. ap. gov. in లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థులు వెంటనే బ్యాంకులో ఖాతా తెరిచి , విద్యార్థి ఆధార్‌ను లింక్ చేయించి డీపీటీ ద్వారా డబ్బు జమ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మెరిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకొని సక్రమంగా ఉన్న వివరాలను సరి చూసుకొని www. scholarships. gov. in లో నమోదు చేసి అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలన్నారు. తర్వాత సంబంధిత పాఠశాల నోడలాఫీసర్, జిల్లా నోడలాఫీసర్ లాగిన్ ద్వారా అప్రూవ్ చేయించుకోవాలన్నారు. ముద్రించిన మెరిట్ కార్డులను త్వరలోనే జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపిస్తామని పేర్కొన్నారు.
రేపటి నుంచి అంగన్‌వాడీ ఆయా పోస్టులకు ఇంటర్వ్యూలు
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో ధర్మవరం, మడకశిర రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ పీడీ ప్రమీల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ధర్మవరం, సీకేపల్లి, బత్తలపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అభ్యర్థులకు ఈనెల 13న ఉదయం 10.30 గంటలకు ధర్మవరం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో, 14న ఉదయం 10.30 గంటలకు మడకశిర డివిజన్ పరిధిలోని మడకశిర, గుడిబండ ప్రాజెక్టుల్లోని అభ్యర్థులకు మడకశిరలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.
బీటెక్‌లో బైపీసీ విద్యార్థులకు ప్రవేశాలు
మడకశిర రూరల్: వ్యవసాయ ఇంజినీరింగ్ బీటెక్ కోర్సులో బైపీసీ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి తొలిసారిగా ప్రవేశాలు కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మడకశిర వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఏడు కొండలు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు నాలుగేళ్ల వ్యవసాయ ఇంజినీరింగ్ బీటెక్ కోర్సులు ఎంపీసీ విద్యార్థులకు మాత్రమే ఉండేవన్నారు. తాజా ఉత్తర్వులతో కన్వీనర్ కోటా కింద మడకశిర వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో బైపీసీ విద్యార్థులకు 15 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఏపీఈఏపీసీఈటీ పరీక్ష రాసి ర్యాంకులు సాధించిన విద్యార్థులు కౌన్సిలింగ్ ద్వారా సీట్లు పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు. బైపీసీ విద్యార్థులకు బుధవారం నుంచి వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. 17 లోపు విద్యార్థులు ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. గురువారం నుంచి 18వ తేదీ వరకూ విద్యార్థులు ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసిన ధ్రువపత్రాలను పరిశీలిస్తారని వివరించారు. 14 నుంచి 19వ తేదీ వరకూ సీట్ల కోసం విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నారు.


