కనగానపల్లి (నాగసముద్రం): చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఐచర్ వాహనాన్ని లారీ ఢీకొంది. దీంతో ఐచర్ వాహనంలో తరలిస్తున్న లక్షకు పైగా కోడి గుడ్లు పగిలిపోయాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. హైదరాబాద్ నుంచి కోలార్‌కు ఐచర్ వాహనంలో కోడి గుడ్లు తరలిస్తున్నారు. నాగసముద్రం సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఐచర్ టైరు పంక్చర్ కావటంతో డ్రైవర్ జాతీయ రహదారి పక్కనే నిలిపాడు. ఈ క్రమంలోనే ఓ లారీ వెనుక వైపు నుంచి ఢీకొనడంతో ఐచర్ రోడ్డు పక్కన బోల్తా పడింది. వాహనంలోని లక్ష కోడిగుడ్లు కిందపడి పగిలిపోయాయి. రూ.7 లక్షలకుపైగా నష్టం వాటిల్లిందని ఐచర్ డ్రైవర్ తెలిపాడు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. చెన్నేకొత్తపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.
ఐచర్‌లోని లక్షకుపైగా కోడిగుడ్లు పగిలిపోయిన వైనం


