ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

Aug 13 2026 1:09 AM | Updated on Aug 13 2026 1:09 AM

ప్రశాంతి నిలయం: పర్తియాత్రలో భాగంగా ప్రశాంతి నిలయానికి విచ్చేసిన హర్యాణా, చండీఘర్‌ సత్యసాయి భక్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి ఆకట్టుకున్నారు. బుధవారం ఉదయం సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత భక్తులు సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ చక్కటి భక్తిగీతాలు ఆలపించారు. సాయంత్రం ‘‘ఆష్టావక్రా–జర్నీ ఫ్రం అద్వైతా టూ సాయి ప్రేమ’’ పేరుతో నాటిక నిర్వహించారు. అందరికీ దేవుడు ఒక్కడేననే సందేశాన్నిచ్చారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement