ఇబ్బంది పెడితే ఉద్యమిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఇబ్బంది పెడితే ఉద్యమిస్తాం

Aug 5 2026 2:17 AM | Updated on Aug 5 2026 2:17 AM

రెండు నెలల నుంచి జీతాలు అందక సమగ్ర శిక్ష ఉద్యోగులందరమూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వానికి చిరుద్యోగులమనే కనికరం కూడా లేదు. కుటుంబ పోషణ చాలా ఇబ్బందిగా మారింది. పిల్లల చదువులు, వ్యవసాయ రుణాలు, ఇంటి అద్దెలు, నిత్యావసరాలు ఇలా అన్నీ జీతంతోనే ముడిపడ్డాయి. కనీసం ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి జీతాలు చెల్లించాలి. ఉద్యోగులను ఇబ్బంది పెడితే మాత్రం ఉద్యమిస్తాం.

– వి.ఓబిరెడ్డి, సమగ్ర శిక్ష

ఉద్యోగుల జిల్లా జేఏసీ అధ్యక్షుడు

జీతాలివ్వకపోతే ఎలా బతకాలి?

ఎన్నో ఏళ్ల నుంచి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాం. ఏడాదికి సరిపడా జీతాల నిధులను బడ్జెట్‌లో కేటాయించకపోవడం బాధాకరం. చిరుద్యోగుకు జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలి. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా ఉద్యోగలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మోసం చేస్తోంది. ఇలాగే ఉద్యోగులను ఇబ్బంది పెడితే ఉద్యమాలు మొదలవుతాయి. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్‌ వేతనాలను వెంటనే విడుదల చేయాలి.

– హెచ్‌ రామన్న, సమగ్ర శిక్ష

ఉద్యోగుల జిల్లా ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement