డీఎస్సీ అభ్యర్థులతో ఆటలొద్దు | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అభ్యర్థులతో ఆటలొద్దు

Aug 5 2026 2:17 AM | Updated on Aug 5 2026 2:17 AM

సాక్షి, పుట్టపర్తి: ఎందరో ఉన్నత విద్యావంతులను తయారు చేసే ఉపాధ్యాయ వృత్తికి ఎంపికై న అర్హులకు అన్యాయం చేసి రూ.లక్షలు దండుకుని అక్రమ మార్గంలో నియామకాలు చేపట్టడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు కన్నెర్రజేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలిసి నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు మంచి స్పందన లభించింది. మంగళవారం హిందూపురం, కదిరి నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నీట్‌ పేపర్‌ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా చేశారని, అదే రీతిలో డీఎస్సీలో అక్రమ నియామకాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 6వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

సీబీఐతో విచారణ చేయించాలి : మక్బూల్‌

డీఎస్సీలో అక్రమ నియామకాలపై సీబీఐతో విచారణ చేయించాలని వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయర్త బీఎస్‌ మక్బూల్‌ డిమాండ్‌ చేశారు. కదిరి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో విద్యార్థి సంఘాల నాయకులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. మక్బుల్‌ మాట్లాడుతూ.. డీఎస్సీలో జరిగిన అవకతవకలకు బాధ్యతవహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయడంతో పాటు విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు. సీబీఐతో సమగ్ర విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. మెగా డీఎస్సీ పేరుతో అభ్యర్థుల జీవితాలను దగా చేశారన్నారు. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈనెల 6 నుంచి రిలే నిరాహార దీక్షలు నిర్వహించి 10న భారీ ర్యాలీ చేయనున్నట్లు వెల్లడించారు.

అక్రమ నియామకాలపై

వైఎస్సార్‌సీపీ నేతల కన్నెర్ర

మంత్రి పదవికి లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌

వైఎస్సార్‌సీపీ రౌండ్‌ టేబుల్‌

సమావేశాలకు స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement