నేటి నుంచి ‘టెట్‌’ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘టెట్‌’

Aug 5 2026 2:17 AM | Updated on Aug 5 2026 2:17 AM

పుట్టపర్తి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహించే ఈ పరీక్షలకు మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,324 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. బీఈడీ, డీఎడ్‌ చేసిన నిరుద్యోగ అఽభ్యర్థులతో పాటు ప్రభుత్వ టీచర్లూ పరీక్షలకు హాజరుకానున్నారు. సుప్రీం కోర్టు నేపథ్యంలో టెట్‌ అర్హత లేని టీచర్లందరూ పరీక్షలు రాయాల్సి వస్తోంది. రోజూ రెండు విడతలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. పుట్టపర్తిలోని సంస్కృతీ ఇంజనీరింగ్‌ కాలేజ్‌, బెంగళూరులోని ఇయాన్‌ డిజిటల్‌ జోన్‌ ఐడీ జెడ్‌, కేబీకే కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఆయా కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. ప్రతి కేంద్రంలోనూ తగినన్ని కంప్యూటర్లు, నిరంతర విద్యుత్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, సీసీ కెమెరాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు హాల్‌టికెట్లతో పాటు ఒరిజినల్‌ గుర్తింపు కార్డు (ఆధార్‌, ఓటర్‌ ఐడీ తదితర) తెచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఇబ్బంది లేకుండా కనీసం గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని చెబుతున్నారు.

జిల్లాలో పరీక్షలు రాయనున్న

2,324 మంది అభ్యర్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement