లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు

Aug 5 2026 2:17 AM | Updated on Aug 5 2026 2:17 AM

పుట్టపర్తి టౌన్‌: ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా బ్రాహ్మణపల్లి లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ హౌసింగ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న జగనన్న లేఅవుట్‌ను తనిఖీ చేశారు. గృహనిర్మాణాల పురోగతని పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ లే అవుట్‌లో ఆన్‌లైన్‌ డేటా ఆధారంగా బేసేమెంట్‌ లెవల్‌ నుంచి ఇళ్లు పూర్తయ్యేస్థాయి వరకు ఉన్న గృహ నిర్మాణాల లబ్ధిదారుల పూర్తి సమాచారాన్ని సేకరించి ఆగిపోయిన గృహ నిర్మాణాలు వెంటనే పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. అలాగే కాలనీలో మౌలిక సదుపాయలపై దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా హౌసింగ్‌ అధికారి వెంకటనారాయణ, తహసీల్దార్‌ సంహిత, ఏఈ ప్రవళ్లికతో పాటు మున్సిపల్‌, హౌసింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

క్యూఆర్‌ కోడ్‌ తప్పనిసరి : జేసీ

ఓడీచెరువు: ప్రభుత్వం చౌకధాన్యం సరఫరాలో నూతనంగా చేపట్టిన క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని తప్పనిసరి అమలు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరధ్వాజ్‌ స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ చౌక ధాన్యపు గిడ్డంగిని ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిడ్డంగిలో నిల్వ ఉన్న చౌక బియ్యం, ఇతర సరుకుల వివరాలు స్టాకిస్ట్‌ నవీన్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండకమర్లలోని 30వ ఎఫ్‌పీ షాపును తనిఖీ చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ శ్రీనివాసులురెడ్డి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన

ధర్మవరం రూరల్‌: మండల పరిధిలోని దర్శనమల పీహెచ్‌సీని మంగళవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఫైరోజా బేగం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఆశా డే కార్యక్రమంపై ఆరా తీశారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలకు తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని ఆశా కార్యకర్తలకు సూచించారు. అనంతరం పీహెచ్‌సీలోని రికార్డులను తనిఖీ చేసి పీహెచ్‌సీ పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్‌ పుష్పలత, మలేరియా సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ జయరాం నాయక్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ రాజశేేఖర్‌రెడ్డి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement