మెరుగైన వైద్య సేవలు అందాలి
● ఎస్‌సీఆర్ పీసీఎండీ డాక్టర్ నిర్మల రాజారాం
గుంతకల్లు: రైల్వే ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని వైద్య సిబ్బందికి దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ నిర్మల రాజారాం సూచించారు. స్థానిక రైల్వే ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన పది పడకల ఐసీయూ చిల్డ్రన్స్ వార్డుతో పాటు ఆధునికీకరించిన మహిళలు, పురుషుల మెడికల్ వార్డులను గురువారం డీఆర్‌ఎం చంద్రశేఖరగుప్త, ఏడీఆర్‌ఎం యు.సుధాకర్‌తో కలసి ఆమె ప్రారంభించి, మాట్లాడారు. రూ.3.14 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో రైల్వే ఆస్పత్రి సీఎంఎస్ డాక్టర్ వేణుగోపాలరెడ్డి, సీనియర్ డీఎఫ్‌ఎం సందీప్, సీనియర్ డీఎంఈ మంగాచార్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.


