చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాలు అప్రతిష్టపాలు
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
నసనకోట ముత్యాలమ్మ ఆలయంలో చోరీకి గురైన హుండీ
సాక్షి, పుట్టపర్తి: జిల్లాలోని వివిధ ఆలయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా హండీలు, ఆభరణాలు దొంగతనానికి గురవుతున్నాయి. అంతేకాదు ఆలయ అధికారులు కూడా దొంగతనానికి యత్నించడం సిగ్గుచేటు.
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆలయాల నిర్వహణ అధ్వానంగా మారిందన్న విమర్శలున్నాయి. కదిరి మండలంలో ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఆభరణాలను అనుమతి లేకుండా తీసుకెళ్తున్న ఆలయ కార్య నిర్వాహక అధికారి మురళీకృష్ణను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు దేవదాయశాఖ కమిషరేట్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎలాంటి అనుమతి లేకుండా ఆలయంలోని ఆభరణాలను కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో తరలిస్తూ పట్టుబడటం విశేషం.
రామగిరి మండలంలో ప్రసిద్ధి చెందిన నసనకోట ముత్యాలమ్మ ఆలయంలో పలుమార్లు హుండీ చోరీ చేశారు. హుండీలను దూరంగా ఎత్తుకెళ్లి నగదు దోచుకెళ్లి అక్కడే పడేసి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు సార్లు హుండీ చోరీ జరిగింది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ముత్యాలమ్మ ఆలయ సమీపంలోనే అనధికారికంగా మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత అండదండలు ఉండటంతో అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటంలేదన్న విమర్శలున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో విచ్చలవిడిగా దొంగతనాలు వెలుగు చూస్తున్నాయి. ఆలయాలకు వెళ్లి వస్తున్న మహిళల మెడలో చైన్లు లాకెళ్లిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. రాత్రి వేళల్లో ఆలయాల్లో చొరబడి హుండీలు దోచుకెళ్తున్నారు. బయటి వాళ్లను పక్కన పెడితే ఆలయ నిర్వహణలో భాగమైనవారు సైతం చోరీలకు యత్నిస్తుండటం గమనార్హం. ఇప్పటికైనా ఆలయాల భదత్ర, ప్రాముఖ్యతను కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది.
పలుమార్లు హుండీ చోరీ
చంద్రబాబు హయాంలో
ఆలయాలు అప్రతిష్టపాలు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోన్న నిర్వాహకులు
కదిరిలో ఆభరణాల దొంగతనానికి అధికారి యత్నం
నసనకోటలో అనుమతులు లేకుండా బెల్టు షాపు ఏర్పాటు
దేవాలయాల్లో తరచూ దొంగతనాలు.. గుప్త నిధుల తవ్వకాలు
విచ్చలవిడిగా దొంగతనాలు
అను‘మతి’ లేకుండా ..
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాలు అప్రతిష్టపాలు
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాలు అప్రతిష్టపాలు


