క్రిస్మస్ సందడి
హిందూపురం: జిల్లాలో క్రిస్మస్ సందడి ప్రారంభమైంది. ఈనెల 25న జరగనున్న పండుగకు క్రైస్తవులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని చర్చీలను విద్యుత్తు దీపాలు, స్టార్లతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. క్రీస్తు జనన వృత్తాంతాన్ని తెలిపేలా ప్రత్యేకంగా బొమ్మలతో పశువుల పాకలు, క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. బుధవారం అర్ధరాత్రి నుంచే కొన్ని చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభం కానున్నాయి. హిందూపురంలోని సీఅండ్‌ఐజీ, న్యూజెరూసలెం, సీఅండ్‌ఐజీ కాంపౌండ్, లక్ష్మీపురం బైబిల్ మిషన్ తదితర చర్చీలను ఆకట్టుకునేలా అలంకరించారు.
క్రిస్మస్ సందడి
క్రిస్మస్ సందడి


