గుంతకల్లు–మార్కాపురం మధ్య త్వరలో కొత్త రైళ్లు
గుంతకల్లు: శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనార్థం గుంతకల్లు – మార్కాపురం మధ్య కొత్త ప్యాసింజర్ రైళ్లను తర్వలోనే ప్రవేశపెట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంతకల్లు జంక్షన్ నుంచి ఈ రైలు (57407) రోజూ సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి నంద్యాల జంక్షన్‌కు రాత్రి 8.20 గంటలకు, మార్కాపురం రోడ్డు రైల్వేస్టేషన్‌కు 11.30 గంటలకు చేరుతుందని పేర్కొన్నారు. తిరిగి ఈ రైలు మార్కాపురం రోడ్డు రైల్వేస్టేషన్ నుంచి (57408) ఉదయం 4.30 గంటలకు బయలుదేరి నంద్యాల జంక్షన్‌కు ఉదయం 7.20 గంటలకు గుంతకల్లు జంక్షన్‌కు ఉదయం 10.30 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ రైలు మద్దికెర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమిట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లి, జగ్గంబోట్ల కృష్ణపురం, కుంభం, తర్లుపాడు మధ్య రాకపోకలు సాగిస్తుందని పేర్కొన్నారు.
99.5 శాతం
పల్స్‌పోలియో పూర్తి
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో 99.5 శాతం 0–5 వయసున్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించినట్లు మాతశిశు మరణాలు యూనిసెఫ్ కన్సల్టెంట్, పల్స్‌పోలియో రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ నాగేందర్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజ బేగం పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 2037 పోలియో బూత్‌లలో 1,88,126 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు చెప్పారు. మంగళవారం చివరి రోజు కావడంతో నాగేందర్ జిల్లాలోని పలు కేంద్రాలను పరిశీలించారు. మొదట కలెక్టర్ శ్యాంప్రసాద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం లేపాక్షి, చాలకూరు గ్రామాల్లో పర్యటించారు. జిల్లాలో1,98,028 మంది చిన్నారులు ఉండగా రెండోరోజు 790 మంది పిల్లలకు, 200 మంది హైరిస్క్ పిల్లలకు మొబైల్ బృందాల ద్వారా పోలియో చుక్కలు వేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సురేష్‌బాబు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు సునీల్ కుమార్, మంజువాణి, నాగేంద్ర నాయక్, చెన్నారెడ్డి పాల్గొన్నారు.
పరీక్షా పే చర్చ రిజిస్ట్రేషన్లు
పెంచండి
పుట్టపర్తి అర్బన్: భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడే అవకాశం ఉన్న పరీక్షా పే చర్చ కార్యక్రమానికి జిల్లా నుండి రిజిస్ట్రేషన్లు పెంచాలని పరీక్షా పే చర్చ నోడలాఫీసర్, బుక్కపట్నం డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. పరీక్ష పే చర్చా కార్యక్రమంలో 6వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల వరకూ పాల్గొనవచ్చన్నారు. ఈనెల 6 నుంచి జనవరి 11 వరకూ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉందన్నారు. పరీక్షల భయం, ఒత్తిడి పోగొట్టడమే పరీక్ష పే ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు https:// innoveteindia1. mygov. in లింకు ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఇదే విషయాన్ని జిల్లా ఉప విద్యాధికారులు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు తమ పరిధిలోని విద్యార్థులకు , తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు.
అటవీ ప్రాంతంలో
డ్రోన్లతో పరిశీలన
లేపాక్షి: అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకట్టకు పోలీసులు పక్కా ప్రణాళిక రూపొందించారు.అందులో భాగంగా లేపాక్షి పరిసర అటవీ ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసేందుకు పోలీసుశాఖ డ్రోన్ పర్యవేక్షణ నిర్వహించింది. అటవీ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అక్రమ కార్యకలాపాలు, ప్రజా భద్రతకు విఘాతం కలిగించే పరిస్థితులను గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డ్రోన్ ఆపరేషన్‌ను చేపట్టినట్లు హిందూపురం రూరల్ సీఐ జనార్దన్ తెలిపారు. మంగళవారం డ్రోన్ ద్వారా మైదుగోళం, లక్ష్మీనరసింహస్వామి కనుమ అటవీ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, మార్గాలు, చెరువులు తదితర వాటిని రికార్డు చేశామన్నారు. తరచూ డ్రోన్ పర్యవేక్షణ నిర్వహించడం ద్వారా మండలంలో నేర కార్యకలాపాలను అరికట్టడడంలో పెద్దగా ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ నరేంద్ర, పోలీసు సభ్యులు పాల్గొన్నారు.
గుంతకల్లు–మార్కాపురం మధ్య త్వరలో కొత్త రైళ్లు


