అటవీ సంపద కాపాడతాం
అటవీ సంపద అగ్నికి ఆహుతవకుండా తగిన చర్యలు తీసుకుంటాం. గ్రామీణ ప్రజలు, గొర్రెలు, ఆవుల కాపరులు అడవులకు నిప్పు పెట్టకుండా తగిన సూచనలిస్తాం. సిబ్బందితో నిఘా ఏర్పాటు చేసి అటవీ ప్రాంతాన్ని కాపాడుతాం. స్థానిక ప్రజలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అడవులకు నిప్పు పెట్టకుండా వారిలో చైతన్యం తీసుకొస్తాం. రోడ్డు పక్కన ఉన్న బోద గడ్డిని తొలగించి ఫైర్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తాం. ప్రజలు అటవీ ప్రాంతాన్ని కాపాడేందుకు సహకరించాలి.
– శ్రీనివాసరెడ్డి,
అటవీశాఖ రేంజర్, పెనుకొండ


