● జెరూసలేము సందడి.. చూద్దాం రండి | - | Sakshi
Sakshi News home page

● జెరూసలేము సందడి.. చూద్దాం రండి

Dec 25 2025 10:26 AM | Updated on Dec 25 2025 10:26 AM

● జెర

● జెరూసలేము సందడి.. చూద్దాం రండి

గుంతకల్లు: క్రిస్మస్‌ సందర్భంగా గుంతకల్లులోని మస్తాన్‌పేట్‌లో నివాసముంటున్న రైల్వే విశ్రాంత ఉద్యోగి హృదయ్‌మోహన్‌ ఫెర్నాండెజ్‌, నిర్మలామేరి దంపతులు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని విశదీకరించేలా బొమ్మలను కొలువుదీర్చారు. ఇందు కోసం తన ఇంటి మిద్దైపె ఓ ప్రత్యేక షెడ్‌ను ఏర్పాటు చేశారు. ఏసు పుట్టిన సమయంలో తోక చుక్క ఆవిర్భవించడం మొదలు... గొర్రెల కాపరుల చుట్టూ పెద్ద వెలుగు రావడం, అప్పటి నజరేతు, బేత్లహము, జెరూసలేము, ఈజిప్టు వాసుల వేషధారణ, సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సందర్భంగా ఫెర్నాండెజ్‌ మాట్లాడుతూ... దాదాపు రెండు నెలల పాటు శ్రమించి ఆఫ్రికా, బెంగుళూరు, ముంబయి, చైన్నె, హైదరాబాదు తదితర నగరాల నుంచి బొమ్మలను సేకరించి కొలువు దీర్చినట్లు తెలిపారు. నెల రోజుల పాటు సందర్శకుల కోసం బొమ్మల కొలువును ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.

● జెరూసలేము సందడి.. చూద్దాం రండి1
1/2

● జెరూసలేము సందడి.. చూద్దాం రండి

● జెరూసలేము సందడి.. చూద్దాం రండి2
2/2

● జెరూసలేము సందడి.. చూద్దాం రండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement