
కన్నడనాట గజరాజుల ఖుషీ
ప్రేమ పెళ్లి.. రెండేళ్లకే బాలిక ఆత్మహత్య
హోసూరు: తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకొన్న బాలిక ఆత్మహత్య చేసుకొన్న ఘటన వెలుగు చూసింది. వివరాల మేరకు.. బిహార్‌కు చెందిన ఉదయ్‌సాధ(19), జ్యోతికుమారి(16) రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ప్రస్తుతం ఈ దంపతులు హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని దాసరపల్లిలో నివాసముంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈనెల 9వ తేదీ జ్యోతికుమారి తన తల్లిదండ్రులతో సెల్‌ఫోన్‌లో మాట్లాడగా వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. దీంతో ఆవేశం చెందిన బాలిక సెల్‌ఫోన్‌ను కింద పడేసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. భార్య ఆచూకీ కోసం భర్త గాలిస్తుండగా అదే ప్రాంతంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకొన్న స్థితిలో ఆమె మృతదేహం కనిపించింది. ఘటనపై బాగలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పెళ్‌లైన రెండేళ్లకే బాలిక బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై హోసూరు సబ్‌కలెక్టర్ విచారణ చేపట్టారు.
డివైడర్‌కు కారు ఢీ..
దంపతుల మృతి
క్రిష్ణగిరి : బెంగళూరు నుంచి పుదుచ్చేరికి వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో దంపతులు మృతి చెందిన ఘటన మత్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన దురైరాజ్(64) పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. ఆయన తన భార్య హిందుల(55)తో కలిసి రెండు రోజుల క్రితం కారులో బెంగళూరుకు వెళ్లారు. సోమవారం సాయంత్రం పుదుచ్చేరికి తిరిగి వెళుతుండగా క్రిష్ణగిరి సమీపంలోని కణ్ణండహళ్లి వద్ద కారు అదుపుతప్పి రోడ్డు మధ్యన ఉన్న డివైడర్‌ను ఢీకొంది. దురైరాజ్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా, హిందులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను హోసూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. మత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనపరుచుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బనశంకరి: గజరాజుల సంతతిలో కన్నడనాడు దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. ఏనుగులు జీవించేందుకు అనుకూలమైన వాతావరణం ఉండటంతో పాటు వాటి రక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్య వల్ల గజ సంపద పెరుగుతోంది. గజరాజుల పరిరక్షణకు ప్రజలను జాగృతం చేసే దృష్టితో అంతర్జాతీయ ఎలిపెంట్ ఫౌండేషన్ వన్యజీవి సంస్థ 2012 నుంచి ఏటా ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఆచరిస్తున్నారు. 2016 నుంచి భారత్‌లో ఏనుగుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1879లో ఏనుగుల సంరక్షణకు ఆదేశాలు జారీచేశారు. ప్రత్యేక అనుమతి మినహా ఏనుగులను వధించడం, గాయపరచడం, బంచడం లాంటి వాటిని నిషేధించారు. 2010లో భారతప్రభుత్వం ఏనుగులను పరంపారిక జంతువుగా ప్రకటించింది.
దక్షిణ భారతదేశంలోనే ఏనుగులు అధికం
దేశంలో 27,312కు పైగా ఏనుగుల సంతతి ఉండగా దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువ శాతం గజరాజులు ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే 12,210 ఏనుగులు ఉన్నాయి. కర్ణాటకలో 6,395 ఏనుగులు, కేరళలో 3,054, తమిళనాడులో 2,761 ఏనుగులు ఉన్నాయి. కర్ణాటక బండీపురలో 1,116 ఏనుగులతో రాష్ట్రంలోనే అత్యధిక ఏనుగులు నిలయంగా ఉంది. నాగరహొళే పులి సంరక్షణప్రదేశంలో 831, మలెమహదేశ్వర వన్యధామకేంద్రంలో 706, బిళిగిరిరంగనబెట్ట ప్రదేశంలో 619, కావేరి వైల్డ్‌లైఫ్‌లో 236, మడికేరి విభాగంలో 214, మడికేరి వైల్డ్‌లైఫ్‌లో 113, మైసూరు విభాగంలో 59, విరాజపేటే విభాగంలో 58 ఏనుగులు ఉన్నాయి. యల్లాపుర విభాగంలో కేవలం 2 ఏనుగులు ఉన్నాయి.
మనావులు, గజరాజుల మధ్య సంఘర్షణ
రాష్ట్రంలోని ఏనుగుల కారిడార్లు చిధ్రం కావడం, అడవుల్లో వెదురు ఎండిపోవడంతో మేత, నీరుకోసం గజరాజులు అరణ్యం వీడి జనారణ్యంలోకి వస్తున్నాయి. దీంతో గజరాజులు, మానవుడి మధ్య సంఘర్షణ తారాస్థాయికి చేరింది. ఫలితంగా ఏనుగుల మృత్యవాత కొనసాగుతుండగా గత ఐదేళ్ల నుంచి వివిధ కారణాలతో 372 ఏనుగులు మృత్యవాతపడ్డాయి. ఇందులో 67 ఏనుగులు మృతి అసహజమరణం కాగా కొన్ని ఏనుగులు తుపాకి గుండ్లకు, మరికొన్ని విద్యుత్‌షాక్ తగిలి మృతిచెందాయి. కొన్ని రైలు ప్రమాదంతో మృత్యవాతపడ్డాయి. హాసన, కొడగు, మైసూరు, చామరాజనగర, మండ్య, బెంగళూరు గ్రామాంతర, కనకపుర ప్రదేశాల్లో ఏనుగులు–మానవుడి సంఘర్షణ హెచ్చుమీరింది. ముఖ్యంగా హాసన జిల్లా సకలేశపుర, ఆలూరు తాలూకాల్లో నిరంతరంగా సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో 2020–21లో 74, (16 అసహజమృతి), 2021–22లో 89(16 అసహజమృతి), 2022–23లో 74,(16 అసహజమృతి), 2023–24లో 101(14 అసహజమృతి),2024–25లో 34(5 అసహజంగా ఏనుగులు మృతిచెందాయి.
విద్యుత్‌షాక్‌తో మృతిచెందిన అశ్వత్దామ
రెండుసార్లు మైసూరు దసరా మహోత్సవంలో పాల్గొని భవిష్యత్ అంబారీ అని ఖ్యాతి ఘడించిన 38 ఏళ్ల అశ్వత్థామ అనే ఏనుగు నాగరహోళే పులి సంరక్షణ ప్రదేశశిబిరంలో విద్యుత్‌షాక్ తో మృతిచెందింది.
ఏనుగు కారిడార్ చాలా ముఖ్యం
ఏనుగు కారిడార్ చిన్నదారి కాగా అవి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సంచరించడానికి అనువు కల్పించాలి. నేడు చాలావరకు ఏనుగు కారిడార్లు ఆక్రమణకు గురికావడంతో ఏనుగులు సంచారానికి ఇబ్బందికరంగా మారింది. ఆయా కాలాలకు అనుగుణంగా ఆహారం లభ్యత చూసుకుని ఏనుగులు సంచరిస్తాయి. వర్షాలు తగ్గినప్పుడు ఊటీ కొండలు పైకి వెళతాయి. వర్షాకాలంలో కొండలు దిగి బండీపుర, నాగరహోళే వైపు వెళతాయి. దీంతో ఏనుగు విషయంలో ఒక భాగానికి మాత్రమే పరిష్కారం చేయడం కుదరదు. తమిళనాడు ఊటీ ,వైనాడు, పాత మైసూరు భాగంతో పాటు మొత్తం పరిష్కారచర్యలు తీసుకోవాలి. ఒడిస్సా, చత్తీస్‌ఘడ్, జార్కండ్, మహారాష్ట్రలో అదికమైన అడవులు ఉన్నప్పటికీ ఏనుగులు లేవు. ఇక్కడ ఉన్న ఏనుగులను అక్కడికి తరలించవచ్చా అనేది శాసీ్త్రయంగా చూడాలని వన్యజీవి నిపుణుడు కేఎస్.సుదీర్ తెలిపారు.
గజ సంపదలో రాష్ట్రం నంబర్ వన్
రాష్ట్రంలో 6,395 ఏనుగులు
నాగరహొళే పులి సంరక్షణప్రదేశంలో అత్యధికంగా 831 గజరాజులు