
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
కదిరి టౌన్: రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వ్యవసాయ, కార్మిక రంగ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మంగళవారం కదిరిలో జరిగిన సీపీఎం 14వ జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా మహాసభలకు విచ్చేసిన ప్రతినిధులతో కలసి సీపీఎం జిల్లా కార్యదర్శిగా రామకృష్ణతో పాటు 11 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్, తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు