
కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారు
రొద్దం: ప్రజాబలం లేకున్నా అధికారం అండతో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ సాగించిన దౌర్జన్యం, దుర్మార్గాన్ని ప్రజలంతా చూశారని, తప్పకుండా వారికి బుద్ధి చెప్పి తీరుతారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని నారనాగేపల్లి గ్రామ పంచాయతీలో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు హామీలు...అమలు చేయకుండా ప్రజలకు చేసిన మోసాన్ని వివరిస్తూ ‘క్యూఆర్ కోడ్’తో రూపొందించిన పోస్టర్లను నాయకులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరు తమ ఫోన్‌తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు ఇచ్చిన హామీలు, చేసిన మోసాలు తెలుస్తాయన్నారు. చంద్రబాబు అనేక తప్పుడు హామీలు ఇచ్చి గద్దెక్కిన తర్వాత ప్రజలను మోసం చేశారన్నారు. చంద్రబాబు అంటేనే మోసం, దగ్గా, కుట్ర అన్నారు. వారు చేస్తున్న దౌర్జాన్యాలకు రాబోవు రోజుల్లో చంద్రబాబు, టీడీపీ నేతలు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం వైఎస్సార్ సీపీ నేతలను అరెస్ట్‌లు చేసి, టీడీపీ కార్యకర్తలను పెద్ద ఎత్తున బూతుల్లోకి వదిలి దౌర్జన్యం చేయడం దుర్మార్గమన్నారు. డీఐజీ, డీజీపీ, ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, కమిషనర్లు, ఎస్‌ఐలు, హోం మంత్రి, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు... ఇంతమంది మకాం వేసి జెడ్పీటీసీ గెలిపించడానికి ఎన్ని దారుణాలు చేశారో ప్రజలంతా చూశారన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు, దుర్మార్గాలు చేసినా నైతికంగా వైఎస్సార్ సీపీనే గెలిచిందన్నారు. ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రజాబలంతో కాకుండా ఈవీఎంల వల్ల ఎన్నికై న వారేనన్నారు.
కలిసి కట్టుగా పనిచేదాం..
వైఎస్సార్ సీపీలో నాయకుడు, కార్యకర్త అనే బేధం లేదని... అందరం ఓ కుటుంబంగా కలిసి కట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, వార్డు సభ్యులు నాగరాజు, నాయకులు ఎన్. నారాయణరెడ్డి, అక్కులప్ప, సి.నారాయణరెడ్డి, జట్టి శ్రీనివాస్‌రెడ్డి, వినయ్‌రెడ్డి, ఆవుల లక్ష్మీనారాయణరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కౌన్సిలర్ సుధాకర్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, సుబ్రహ్మణ్యంరెడ్డి, మహేశ్వరరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, వీరేష్, శంకర్‌రెడ్డి, సత్యనారాయణ, వేణు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ ధ్వజం