
రైతాంగ సమస్యలపై మహాసభలో తీర్మానాలు
31 ద్విచక్ర వాహనాల స్వాధీనం
పెనుకొండ: ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి 31 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పెనుకొండ డీఎస్పీ నర్శింగప్ప తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. దుద్దేబండ క్రాస్ వద్ద సీఐ రాఘవన్ పర్యవేక్షణలో కియా ఎస్‌ఐ రాజేష్, సిబ్బంది బుధవారం వాహన తనిఖీలు చేపట్టారన్నారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన పెనుకొండ మండలం మునిమడుగుకు చెందిన ఓబన్న గారి వినోద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో వాహనాల అపహరణ విషయం బయటపడిందన్నారు.
దీంతో నిందితుడు తెలిపిన మేరకు హరిపురం వద్ద ఓ రేషం గ్రైనేజ్ సెంటర్‌లోని పాడుబడిన రూంలో భద్రపరిచిన 31 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వీటి విలువ రూ. 18.60 లక్షలు ఉంటుందన్నారు. కాగా, సెల్‌ఫోనప్లు, డ్రిప్‌వైర్లు అపహరించిన కేసుల్లో ధర్మవరం, అనంతపురం రైల్వే పీఎస్, కొత్తచెరువు పీఎస్ పరిధిలో వినోద్‌పై కేసులు ఉన్నాయన్నారు.
జల్సాలకు అలవాటు పడి అనంతపురంలో 8, కదిరిలో 6, కర్ణాటకలోని పావగడలో 5, కర్నూలు జిల్లా డోన్‌లో 3, తిరుపతిలో 3, ధర్మవరంలో 2, కళ్యాణదుర్గం, పాకాల, రొద్దం, ముదిగుబ్బలో ఒకటి చొప్పున మొత్తం 31 మోటార్ సైకిళ్లు అపహరించినట్లుగా వినోద్ అంగీకరించాడన్నారు. అపహరించిన వాహనాల్లో ఒకటి మినహా మిగిలినవన్నీ హీరో హోండా కంపెనీకి చెందినవే కావడం గమనార్హం అన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించామన్నారు. నిందితుడి అరెస్ట్‌లో చొరవ చూపిన కియా పీఎస్ ఎస్‌ఐ రాజేష్, క్రైమ్ సిబ్బంది నాగరాజు, మారుతి, తదితరులను ఎస్పీ రత్న అభినందించారు.

రైతాంగ సమస్యలపై మహాసభలో తీర్మానాలు