
ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ రత్న
విచారణ అనంతరం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడి
పుట్టపర్తి టౌన్/ ముదిగుబ్బ: న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన గిరిజన మహిళను లైంగికంగా వేధించడంతో పాటు రాత్రి వేళల్లో నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడిన ‘పట్నం’ ఎస్‌ఐ రాజశేఖర్‌పై వేటు పడింది. పోలీసు స్టేషన్‌కు వచ్చే మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉన్న అతను అమాయక గిరిజన మహిళను వేధించడంతో వీఆర్‌కు పంపుతూ ఎస్పీ రత్న మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ముదిగుబ్బ మండలం గరుగుతండాకు చెందిన ఓ గిరిజన మహిళలను లైంగికంగా వేధించిన రాజశేఖర్ గురించి ‘సాక్షి’ మంగళవారం ‘నాతో వస్తే ఓకే... లేదంటే ఇబ్బంది పడతావ్..’ శీర్షికన వార్త ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎస్పీ రత్న వెంటనే అతన్ని వీఆర్‌కు పంపారు. అలాగే ఎస్‌ఐ రాజశేఖర్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని సంబం«ధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. విచారణ అనంతరం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పట్నం ఎస్‌ఐగా జయరాంనాయక్
‘పట్నం’ ఎస్‌ఐగా కె. జయరాంనాయక్‌ను పోలీసు ఉన్నతాధికారులు నియమించారు. దీంతో మంగళవారమే ఆయన బాధ్యతలను చేపట్టారు. లైంగిక వేధింపుల నేపథ్యంలో ఇప్పటి వరకూ పట్నం ఎస్‌ఐగా ఉన్న రాజశేఖర్‌ను వీఆర్‌కు పంపిన ఎస్పీ రత్నం..ఆయన స్థానంలో వీఆర్‌లో ఉన్న జయరాంనాయక్‌ను నియమించారు.
నాతో వస్తే ఓకే.. లేదంటే ఇబ్బందిపడతావ్..