
మెట్రో ఫీడర్ బస్సు సర్వీసులకు శ్రీకారం
బనశంకరి: ఎల్లో మెట్రో మార్గానికి అనుసంధానంగా బీఎంటీసీ ఏర్పాటు చేసిన మెట్రో ఫీడర్‌బస్సు సర్వీస్ సేవలను ఎలక్ట్రానిక్ సిటీ వద్ద రవాణాశాఖమంత్రి రామలింగారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణప్ప మంగళవారం ప్రారంభించారు. బెంగళూరునగర, శివారు వలయ ప్రయాణికులకు ఉత్తమ, సులభ రవాణా సేవలను అందించేందుకు రోజూ 6217 బస్సులతో 65, 206 ట్రిప్పులతో 12.85 లక్షల కిలోమీటర్ల మేర సంచరిస్తూ 44 లక్షల మందిని గమ్యాలకు చేర్చుతున్నట్లు మంత్రి తెలిపారు. 20 లక్షల మందికిపైగా ప్రయాణికులు మెట్రో ఫీడర్‌సేవలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎలక్ట్రానిక్‌సిటీ చుట్టుపక్కల ప్రదేశాల్లో హొసూరు మెయిన్‌రోడ్డులో 100 మార్గాల్లో 619 నెంబరుతో 3 వేల ట్రిప్పులు మెట్రో ఫీడర్ బస్సులు సేవలు అందించనుంది.