
అధికారమిస్తే రైతులకు నిరంతర విద్యుత్
హోసూరు, కెలమంగలం: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత యడపాడి పళణీస్వామి రెండు రోజుల పాటు జిల్లాలోని వేపనపల్లి, తళి, హోసూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. సోమవారం సాయంత్రం రాయకోట సమీపంలోని కాడుశెట్టిపల్లి వద్ద ఆయనకు అన్నాడీఎంకే నాయకులు భారీ ఎత్తున స్వాగతం లభించింది. కెలమంగలంలో మంజునాథ్, మునిరెడ్డి, సంగీత వెంకటరామన్, కే.వీ.వెంకటేష్ తదితరులు మాజీ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాయకోట బస్టాండు, కెలమంగలం, డెంకణీకోట, హోసూరు ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించారు. డెంకణీకోట, హోసూరులో అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలపై వివరించారు. రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ కార్యాలయం ప్రారంభం
హోసూరు పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాన్ని మంగళవారం ఉదయం మాజీ సీఎం పళణీస్వామి ప్రారంభించారు. తేరుపేటలో వెలసిన శ్రీమరకతాంబ సమేత చంద్రచూడేశ్వరస్వామిని దర్శించుకొన్నారు. మధ్యాహ్నం పారిశ్రామికవాడ మూకొండపల్లిలోని ప్రైవేట్ హోటల్‌లో రైతులు, పారిశ్రామికవేత్తలు, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. కార్యక్రమానికి క్రిష్ణగిరి పశ్చిమ జిల్లా కార్యదర్శి మాజీ మంత్రి పి.బాలక్రిష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. రాజ్యసభ సభ్యుడు తంబిదురై, వేపనపల్లి ఎమ్మెల్యే కే.పీ.మునిస్వామి, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
క్రిష్ణగిరి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి
పళణీస్వామి వెల్లడి