తప్పుల్లేని ఓటరు జాబితాకు సహకరించాలి
ప్రశాంతి నిలయం: తప్పుల్లేని ఓటరు జాబితా తయారీకి అందరూ సహకరించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భగా కలెక్టర్ మాట్లాడుతూ....తప్పుల్లేని ఓటరు జాబితా రూపకల్పన, మార్పులు, చేర్పులు పోలింగ్ శాతం పెంచేందుకు రాజకీయ పార్టీల నేతలూ తగిన సలహాలు, సూచనలు ఇవ్వవచ్చన్నారు. ఓటరు జాబితాలో పేరు నమోదు, తొలగింపు, సవరణ, ఇతర క్‌లైయిమ్‌లకు సంబంధించిన అంశాలపై చేసిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవచ్చన్నారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్, ఓటర్ల రేషనలైజేషన్ ప్రక్రియలో రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలని కోరారు. దీనికోసం ముందుగానే ఆయా పార్టీలు తమ ఏజెంట్ల ద్వారా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి వివరాలను సేకరించి సన్నద్ధంగా ఉంటే ప్రక్రియను సులువుగా పూర్తి చేయవచ్చన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ విజయసారథి, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ జాకీర్ హుస్సేన్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరిన కలెక్టర్ టీఎస్ చేతన్


