
రాగి పంటను పరిశీలిస్తున్న అధికారులు
● పరిగిలో పర్యటించిన కేంద్ర బృందం
● గొరవనహళ్లిలో పంటల పరిశీలన
పరిగి: రైతుకు మేలు చేసే సేంద్రియసాగును మరింత ప్రోత్సహించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం బృందం సభ్యులు తెలిపారు. శుక్రవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శైలేష్‌కుమార్ సింగ్, అడిషనల్ సెక్రెటరీ చరణ్‌జిత్ సింగ్, రూరల్ డెవలప్‌మెంట్ మిషన్ డైరెక్టర్ గోయల్, విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్, అనంతపురం ఉమ్మడి జిల్లాల ప్రాజెక్టు మేనేజర్లు లక్ష్మీనాయక్, రామ్మోహన్ తదితరులు పరిగి మండలంలో పర్యటించారు. గొరవనహళ్లిలో రైతులు సేంద్రియ పద్ధతులతో సాగు చేసిన మామిడి, సపోట, రాగి, మొక్కజొన్న తదితర పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా గంగమ్మ, అనిత, అశ్వర్థనారాయణ, లక్ష్మీ, మల్లేగౌడు, శ్రీకంఠ తదితర రైతులతో మాట్లాడి సేంద్రియ సాగు విధానాలను తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా మార్చేందుకే తాము అధ్యయనం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.