బహిరంగ ప్రదేశాల్లో దూమపానం నిషేధం : ఎస్పీ | Sakshi
Sakshi News home page

బహిరంగ ప్రదేశాల్లో దూమపానం నిషేధం : ఎస్పీ

Published Wed, Jan 31 2024 1:10 AM

- - Sakshi

పుట్టపర్తి టౌన్‌: బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు. పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై వైద్య ఆరోగ్య శాఖ ముద్రించిన పోస్టర్లను మంగళవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో ఆయన విడుదల చేసి మాట్లాడారు.

బహిరంగ ప్రదేశాలతో పాటు విద్యాసంస్థలు వద్ద ధూమపానాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. 18 సంవత్సరాలలోపు వారికి పొగాకు ఉత్పత్తులు విక్రయించడమూ చట్టరీత్యా నేరమన్నారు.

జిల్లాలో పొగాకు నిషేధిత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బందితో పాటు అడిషనల్‌ ఎస్పీ విష్ణు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement