బస్సులో 600 గ్రాముల బంగారు ఆభరణాల చోరీ | - | Sakshi
Sakshi News home page

బస్సులో 600 గ్రాముల బంగారు ఆభరణాల చోరీ

Jul 27 2023 7:32 AM | Updated on Jul 27 2023 7:39 AM

- - Sakshi

మడకశిర/ హిందూపురం అర్బన్‌: ిహందూపురం నుంచి మడకశిరకు వస్తున్న ఆర్టీసీ బస్సులో బుధవారం మధ్యాహ్నం 600 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల మేరకు... మడకశిరకు చెందిన ఆదినారాయణ సతీమణి విజయలక్ష్మి పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గత శనివారం హిందూపురంలోని తన కుమార్తె సంధ్య ఇంటికి వెళ్లింది. బుధవారం కుమార్తె ఇంటి నుంచి మడకశిరకు బయలుదేరింది.

దాదాపు 600 గ్రాముల బంగారు ఆభరణాలను ఒక బ్యాగులో ఉంచుకుని మధ్యాహ్నం హిందూపురంలోని పరిగి బస్టాండ్‌లో వచ్చి అక్కడ మడకశిర వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఇంటికి చేరుకున్న బాధితురాలు బంగారు ఆభరణాలున్న బ్యాగు చూసుకోగా ...కనిపించలేదు. మార్గంమధ్యలోనే బంగారు ఆభరణాల బ్యాగు చోరీ గురైనట్లు ఆమె తెలుసుకుంది.

కుటుంబీకులతో కలిసి బుధవారం రాత్రి హిందూపురం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. డీఎస్పీ కంజాక్షన్‌ బాధితురాలికితో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా పరిగి బస్టాండు వద్ద తన పక్కనే ఇద్దరు మహిళలు కూర్చుని వెంటనే వెళ్లిపోయారని ఫిర్యాదులో బాధితురాలు విజయలక్ష్మి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement