మడకశిర: టీడీపీ వారు చెబితేనే ట్రాన్స్‌ఫార్మర్లు ఇస్తారా..? అంటూ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం మడకశిరలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఈరలక్కప్ప మాట్లాడుతూ నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్లు పారదర్శకంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. టీడీపీ నాయకులు చెప్పిన వారికే ట్రాన్స్‌ఫార్మర్లను అందిస్తున్నారని, రూ.లక్షలు చేతులు మారుతున్నాయని ధ్వజమెత్తారు. సీనియారిటీ ప్రకారం ట్రాన్స్‌ఫార్మర్లను పంపిణీ చేయడం లేదని ఈఈ చంద్రానాయక్‌కు వివరించారు. ఇప్పటికై నా మేల్కొని పారదర్శకంగా పంపిణీ చేయకపోతే విద్యుత్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల, పట్టణ కన్వీనర్లు శ్రీరాములు, ఓంకుమార్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, కుంచిటి వక్కలిగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రంగేగౌడ్, బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంతరాజు, మండల కన్వీనర్లు యంజారేగౌడ్, త్రిలోక్‌నాథ్, శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ సమన్వయకర్త
ఈరలక్కప్ప ధ్వజం
పారదర్శకంగా పంపిణీ చేయకుంటే దీక్షలు చేపడతామని హెచ్చరిక


