మర్యాదపూర్వకంగా.. | - | Sakshi
Sakshi News home page

మర్యాదపూర్వకంగా..

Aug 13 2026 12:45 AM | Updated on Aug 13 2026 12:45 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ

మురళీధర్‌ మర్యాదపూర్వకంగా

బుధవారం కలిశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌

అభ్యంతరాలను రేపటిలోపు తెలియజేయాలి

నెల్లూరు (టౌన్‌): జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న ఆరు పోస్టులకు రోస్టర్‌ వారీగా మెరిట్‌ జాబితాను deonellore.50webs.comలో పొందుపర్చామని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే సంబంధిత డాక్యుమెంట్ల జిరాక్స్‌లను నగరంలోని సమగ్రశిక్ష కార్యాలయంలో గురు, శుక్రవారాల్లో అందజేయాలని కోరారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నరసింహమూర్తి

విశాఖపట్నానికి శ్రీనివాస్‌ బదిలీ

నెల్లూరు (లీగల్‌): జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌ను విశాఖపట్నం ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఈయన స్థానంలో తిరుపతి స్పెషల్‌ కోర్టు (ఎర్రచందనం) న్యాయమూర్తి నరసింహమూర్తిని నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు బుధవారం జారీ చేసింది. పెండింగ్‌ కేసుల పరిష్కారంతో పాటు జిల్లా కోర్టు భవనాల సుందరీకరణ, కోర్టు ఆవరణలో పార్కింగ్‌ పనులు, లిఫ్టు తదితరాలు ఇటీవలి కాలంలో విజయవంతంగా సాగాయి.

నరసింహమూర్తి

శ్రీనివాస్‌

ప్రభుత్వానికి చెందిన విలువైన ఇరిగేషన్‌ భూమిని మంత్రి నారాయణ సంస్థకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నారాయణ మెడికల్‌ కాలేజీ పక్కనే ఉన్న రూ.కోట్లు విలువైన కాలువ పోరంబోకు భూమిని మార్కెట్‌ రేటుకే నారాయణ ఎడ్యుకేషన్‌ సొసైటీకి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటికే కార్పొరేషన్‌ కౌన్సిల్‌ అజెండాలో ఒక అంశంగా పెట్టి ఆమోదం పొందేందుకు చేసిన ప్రయత్నం హాట్‌టాపిక్‌గా మారింది. అధికార బలంతో ‘మాస్టారు’ స్కెచ్‌తో ఫైళ్లకు రెక్కలొచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement