పులికల్లు ఎస్టీ కాలనీలో గత ప్రభుత్వంలో పక్కా ఇళ్లు 35 మంజూరు చేశారు. ఇళ్లను అప్షన్–3 కింద నిర్మించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే బిల్లులు చెల్లించని కారణంగా అరకొరగా ఇళ్లను నిర్మించారు. ఇప్పటికీ పూర్తి చేయకపోవడంతో వాటిలో నివాసం ఉంటున్నాం. ఇదే విషయంపై పల్లెవీక్షణకు జూన్ 16న కలెక్టర్ వచ్చిన సందర్భంగా అర్జీ ఇచ్చాం. ఇప్పటి వరకు ఇళ్లకు సంబంధించిన అధికారులు ఎవరూ వచ్చి వివరాలు అడగలేదు. మా కాలనీలో మురుగు కాలువలు, వీధిలైట్లు కూడా లేవు. ఇళ్లకు బిల్లులు అందజేస్తే అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేస్తామంటున్నారు.
– నల్లు పెంచలయ్య, పులికల్లు ఎస్టీకాలనీ, పొదలకూరు మండలం


