వేదగిరీశురుడిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి దంపతులు
నెల్లూరు సిటీ: మండలంలోని వేదగిరిపై కొలువైన లక్ష్మీనరసింహస్వామిని హైకోర్టు జడ్జి జస్టిస్ కె.సురేష్‌రెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ముఖ్య అర్చకులు భాస్కరాచార్యులు, అర్చక స్వాములు మాధవగిరి కృష్ణమాచార్యులు, మాధవగిరి రాఘవాచార్యులు, మాధవగిరి అప్పలాచార్యులు, ఈఓ వేమూరి గోపి, చైర్మన్ ఇందుపూరు అచ్యుత్‌రెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితోపాటు జిల్లా జడ్జి జి. శ్రీనివాస్, ఒకటో అదనపు జిల్లా జడ్జి గీత, ఒకటో అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎస్.శ్రీనివాస్, నెల్లూరు రూరల్ డీఎస్పీ. ఘట్టమనేని శ్రీనివాసరావు, నెల్లూరురూరల్ సీఐ వేణు, ఎస్‌ఐ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుకలు
నెల్లూరు (లీగల్): వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జోనల్ ఇన్‌చార్జి రామిరెడ్డి రోజారెడ్డి ఆధ్వర్యంలో లీగల్ సెల్ న్యాయవాదులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక విశ్వభారతి అంధుల పాఠశాలలో ఆదివారం కోలాహలంగా నిర్వహించరు. అంధ విద్యార్థులకు దుప్పట్లు, ఫ్రూట్ జ్యూస్, పండ్లు, బిస్కెట్లను అందజేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పి.ఉమామహేశ్వర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్ధన సుబ్బారెడ్డి, న్యాయ విభాగం జిల్లా నేత లు ధనపాల్ రమేష్, సీహెచ్ శ్రీధర్, విక్రమ్ కుమార్‌రెడ్డి, కనకాద్రి, విద్యాధరరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, కమలాకర్‌రెడ్డి, సుధీర్, శివ, సాయికృష్ణరెడ్డి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
8 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం క్యూ కాంప్లెక్స్‌లోని 14 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 78,466 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 29,722 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.51 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
వేదగిరీశురుడిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి దంపతులు
వేదగిరీశురుడిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి దంపతులు


