పోలియోను తరిమికొడదాం
కొడవలూరు: వైద్యాఆరోగ్యశాఖ జేడీ కామేశ్వర ప్రసా ద్ కొడవలూరులోని గిరిజన కాలనీ అంగన్‌వాడీ కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారా..లేదా..అని పరిశీలించారు. అనంతరం కాలనీలోని పలు ఇళ్లకు వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేశారా..లేదా అని ఆరా తీ శారు. పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసినట్లు నిర్ధారించుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులకు పోలి యో చుక్కలు వేయించి పోలియోను తరిమికొడ దామని పిలుపునిచ్చారు. ఆయన వెంట వైద్యాధికారులు ఎం రామకృష్ణ, జీ బాలచంద్రబాబు, అమరేంద్రనాఽథ్‌రెడ్డి, హెచ్‌ఏ షఫీ ఉద్దీన్ ఉన్నారు.


