నోటీసులు ఉపసంహరించుకోకుంటే ఉద్యమిస్తాం
టిఫిన్ అంగడి మీద బతికేదాన్ని ఎలా కట్టాలి?
నేను చిన్న టిఫిన్ అంగడి పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటు న్నా. మాది స్లమ్‌ఏరి యా. కుళాయిల ద్వారా నీరు కూడా సక్రమంగా రావు. ఏ రోజూ కూడా కుళాయి బిల్లు కట్టాలని కార్పొరేషన్ వారు అడగలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి రూ.27 వేలు పన్ను కట్టమని నోటీసులిచ్చారు. అంత మొత్తం నేను ఏ రకంగా కట్టాలి. నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి.
– ఒంగోలు రమాదేవి, సుందరయ్య కాలనీ
భయభ్రాంతులకు
గురిచేస్తున్నారు
●
మేము రోజువారి కూలి పని చేసుకుంటూ బతికే వాళ్లం. ఇంత వరకు ఎప్పుడూ కుళాయి పన్ను కట్టిమని కార్పొరేషన్ అధికారులు అడగలేదు. ఇప్పుడు ఏకంగా రూ.23,600 కట్టాలని కోర్టు నోటీసు ఇచ్చారు. పన్ను కట్టకపోతే జైలుకు పంపిస్తామని మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేయడం ఎంత వరకు న్యాయం.
– డీ సునీత, వీఎంఆర్‌నగర్
నెల్లూరు కార్పొరేషన్ చరిత్రలో కుళాయి పన్నులు కట్టాలని కోర్టు ద్వారా నోటీసులు ఎ ప్పుడూ పంపించ లేదు. ప్రత్యేకించి పేదలు నివసించే మురికివాడల్లో జాతీయ మురికివాడల అభివృద్ధి పథకం ద్వారా ఇచ్చిన కుళాయి కనెక్షన్లకు పన్నులు కట్టాలని ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్నఫలంగా వేలాది రూపాయలు కట్టమనడం దుర్మార్గం. మున్సిపల్ అధికారులు కోర్టు నోటీసులు పంపి పేదలను భయభ్రాంతులకు గురిచేయడం సమంజసం కాదు. నోటీసులు ఉపసంహరించుకోకపోతే ఉద్యమిస్తాం. – కే పెంచల నరసయ్య,
సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు
నోటీసులు ఉపసంహరించుకోకుంటే ఉద్యమిస్తాం
నోటీసులు ఉపసంహరించుకోకుంటే ఉద్యమిస్తాం


