మర్యాదపూర్వకంగా..
నెల్లూరు సిటీ: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన వీరి చలపతిరావు సోమవారం నగరంలోని మినీ బైపాస్‌రోడ్డులో మాజీ ఎంపీ, ఆ పార్టీ నేత ఆదాల ప్రభాకర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదాలకు పుష్పగుచ్ఛం అందజేశారు.
కిమ్స్‌లో ఘనంగా
ప్రీ క్రిస్మస్ వేడుకలు
నెల్లూరు(అర్బన్): దర్గామిట్టలోని కిమ్స్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సోమవారం ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్లు, టెక్నీషియన్లు, నర్సింగ్, ఆఫీసు, సెక్యూరిటీ సిబ్బంది మధ్య బాధ్యులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. బహుమతులు అందించారు. డాక్టర్లు, ఉద్యోగులు పాటలు, డ్యాన్సులు, నాటికలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ సతీష్‌కుమార్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి ప్రియలక్ష్మి మాట్లాడారు. శాంతికి చిహ్నం క్రిస్మస్ పండగ అన్నారు. 24 గంటలూ పని ఒత్తిడిలో ఉండే డాక్టర్లు, ఉద్యోగులు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించుకోవడం ద్వారా ఐక్యత పెరుగుతుందన్నారు.
గుర్తుతెలియని
వాహనం ఢీకొని..
● యువకుడి మృతి
గుడ్లూరు: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన 16వ నంబర్ జాతీయ రహదారిపై శాంతినగర్ వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం నందవరం గ్రామానికి చెందిన జయంపు దుర్గాప్రసాద్(35) ఆదివారం సింగరాయకొండలో ఉన్న తన సోదరి అంజలి వద్దకు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఊహించని రీతిలో శాంతినగర్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృత్యువాత పడ్డాడు. మృతుడు అర్ధరాత్రి వేళ శాంతినగర్ వైపు ఎందుకు వచ్చాడో దర్యాప్తులో తేలాల్సి ఉంది. దుర్గాప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు చేసినట్లు గుడ్లూరు ఎస్సై వి.వెంకట్రావు తెలిపారు.
తల్లికి వందనం
ఇప్పించండి సారూ..
నెల్లూరు(దర్గామిట్ట): అమ్మానాన్న లేరు.. మాకు తల్లికి వందనం డబ్బులు రాలేదు. ఆదుకోండి సారూ అంటూ విద్యార్థినులు కలెక్టర్ హిమాన్షు శుక్లాను కోరారు. వివరాలిలా ఉన్నాయి. పొదలకూరు మండలం నల్లపాళేనికి చెందిన సునీల్, శ్రీవిజయకు కీర్తన, మేరీ బ్లెస్సీ అనే కుమార్తెలున్నారు. ఆడపిల్లలు పుట్టారని నెపంతో సునీల్ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. మూడేళ్ల క్రితం శ్రీవిజయ అనారోగ్యంతో మృతిచెందింది. అప్పట్నుంచి పిల్లలు అమ్మమ్మ వద్ద ఉంటున్నారు. మండలంలోని తాటిపర్తిలో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో బ్లెస్సీ 9వ తరగతి, కీర్తన ఏడో తరగతి చదువుతున్నారు. తమకు తల్లికి వందనం పథకం నగదు రాలేదంటూ సోమవారం తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మర్యాదపూర్వకంగా..
మర్యాదపూర్వకంగా..


