96.12 శాతం మందికి పోలియో చుక్కలు
నెల్లూరు (అర్బన్): జిల్లాలో ఆదివారం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమంలో 96.12 శాతం మంది పిల్లల కు చుక్కలు వేశారు. వైద్యశాఖ ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఇంటింటా జరిపిన సర్వేలో అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులు మొత్తం 2,94,604 మంది ఉన్నట్టు లెక్కలు తేల్చారు. 2396 పోలియో బూత్‌ల ద్వారా తొలి రోజు ఆదివారం 2,83,173 మంది పిల్లలకు చుక్కల మందు వేశారు. డీఎంహెచ్‌ఓ సుజాత మాట్లాడుతూ రైల్వేస్టేషన్, ఆర్టీ సీ, ఆత్మకూరు బస్టాండ్ తదితర ప్రాంతాల్లో 85 ట్రాన్సిట్ బూత్‌ల ద్వారా ప్రయాణిస్తున్న పిల్లలకు చుక్కల మందు వేశామన్నారు. ఏదైనా కారణంతో తమ బిడ్డలకు తొలి రోజు చుక్కల మందు వేయించని తల్లిదండ్రులు సోమ, మంగళవారాల్లో ఇంటింటికి వచ్చే తమ ఆరోగ్య, అంగన్‌వాడీ సిబ్బంది ద్వారా చుక్కల మందు వేయించాలని కోరారు. మిగతా పిల్లలకు సోమ, మంగళవారాల్లో ఇంటింటికి తిరుగుతూ పోలియో డ్రాప్స్ తమ సిబ్బంది వేస్తారన్నారు. 100 శాతం టార్గెట్ రీచ్ అవుతామని తెలిపారు. కార్యక్రమంలో జల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి, జీజీహెచ్ పీడియాట్రిక్ హెచ్‌ఓడీ డాక్టర్ సర్దార్‌సుల్తానా, డెమో అధికారి కనకరత్నం, డీఎంఓ హుస్సేనమ్మ, డీపీఎంఓ సునీల్‌కుమా ర్, పోలియో సర్వెలెన్స్ అధికారి డాక్టర్ సురేష్, పీపీయూనిట్ మెడికల్ ఆఫీసర్ డా.శేషమ్మ పాల్గొన్నారు.


