
సహకార సంఘ సభ్యులకు శిక్షణ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): నెల్లూరు రూరల్ వ్యవసాయ, అనుబంధ రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘ సభ్యులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నగరంలోని డీసీఓ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఓ గుర్రప్ప మాట్లాడారు. అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని వ్యవసాయంలో సాంకేతికత, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇచ్చామని వివరించారు. అనంతరం సంఘ సభ్యులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, నిబంధనావళి ప్రతలను అందజేశారు. డీసీఓ కార్యాలయ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరి, సీనియర్ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.