రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర కేసు | - | Sakshi
Sakshi News home page

రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర కేసు

Aug 21 2025 9:26 AM | Updated on Aug 21 2025 9:26 AM

రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర కేసు

రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర కేసు

కావలి (జలదంకి): కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రస్తుత ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నాడని, అటువంటి నీచ సంస్కృతిని విడనాడకపోతే అధికార మదంతో చేసే ప్రతి పనికీ బుద్ధి చెబుతామని కావలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు. బుధవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పందిటి కామరాజు మాట్లాడుతూ అక్రమ మైనింగ్‌ జరుగుతుండడంతో విజువల్స్‌ తీసేందుకు వెళ్లిన సోషల్‌ మీడియా యాక్టివిస్టులను పట్టుకుని, దారుణంగా హింసించడమే కాకుండా వారిని హంతుకులుగా చిత్రీకరించేందుకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి బరి తెగింపునకు త్వరలోనే బుద్ధి చెబుతామన్నారు. సౌమ్యుడు, మితభాషి అయిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నీచ సంస్కృతి, రౌడీ రాజకీయం చేసే నీలాంటి వాడిని చంపించే ప్రయత్నం చేశారంటూ నువ్వు చేస్తున్న ప్రచారం చూసి నియోజకవర్గ ప్రజలు నివ్వెరపోతున్నారన్నారు. కుట్రలకు, కుతంత్రాలతో ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడానికి, నీ అవినీతి సామ్రాజ్యాన్ని బయట పెట్టాలకున్న సోషల్‌ మీడియా సభ్యులను కొట్టి, వారి చేతుల్లో కత్తులు పెట్టించి బెదిరించి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పంపిస్తే కృష్ణారెడ్డిని చంపడానికి వచ్చామని వీడియో రికార్డు చేయించారన్నారు. పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ కావలిలో ఏదో జరిగిపోయింది, ఎమ్మెల్యేపై హత్యాయత్నం అంటూ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కొంత మంది ఏడుపులు, పెడబొబ్బలు పెట్టారని, అసలు జరిగింది తెలుసుకోకుండా, పోలీసులు విషయాన్ని తెలపకుండానే నలుగురు చిడతల విలేకరులు స్క్రోలింగ్‌ పెడితే అదే వాస్తవమని ఇలా దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్నా రో తెలుసుకోవాలన్నారు. ముసునూరు మనీ స్కాంలో ఎమ్మెల్యేకు ఎంత ముడుపులు అందాయో నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు, ఇసుక దందా, రేషన్‌ దందా ఎలా నిర్వహిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇలాంటి అవినీతి దందాలను మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి నిత్యం ఎండగడుతుండడంతో ఎమ్మెల్యే అసహనంతో ఊగిపోతూ వీధి రౌడీలా మాట్లాడిన మాటలను ప్రజలను తెలుసుకున్నారన్నారు. జలదంకిలో డ్రోన్‌ సాయంతో అక్రమ మైనింగ్‌పై విజువల్స్‌ తీసిన అమాయకులపై అక్రమ కేసులు పెట్టడం చూస్తుంటే రక్తచరిత్ర సినిమాను మించి దర్శకత్వం చేసినట్లు ఉందన్నారు. మాజీ ఎంపీపీ మహేశ్వరమ్మ మాట్లాడుతూ అధికారం నీటి బుడగతో సమానం అని, కక్ష రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పార్టీ నాయకులు గంధం ప్రసన్నాంజనేయులు, కనమర్లపూడి వెంకటనారాయణ, మద్దిబోయిన వీరరఘు, వాయిల తిరుపతి, నెల్లూరు వెంకటేశ్వర్లురెడ్డి, పరుసు మాల్యాద్రి, కుందుర్తి కామయ్య, కనపర్తి రాజశేఖర్‌, చైతన్య, మహేష్‌నాయుడు, దండే కృష్ణారెడ్డి, బీద రమేష్‌, కొమారి రాజు, చెన్ను ప్రసాద్‌రెడ్డి, నాగాచారి, ఏగూరి పుల్ల య్య, గుడ్లూరి మాల్యాద్రి, ఏసుదాస్‌, శశిధర్‌, జీవీ, గిరి, చల్లా శ్రీనివాసులరెడ్డి, కళ్యాణి పాల్గొన్నారు.

ప్రతాప్‌కుమార్‌రెడ్డి వ్యక్తిత్వం, కృష్ణారెడ్డి వైఖరి ఏమిటో అందరికీ తెలుసు

దాడులు, అక్రమ కేసులే

టీడీపీ పాలనా విధానం

అధికార మదంతో చేసే ప్రతి పనికీ బుద్ధి చెబుతాం

అక్రమ కేసులకు వైఎస్సార్‌సీపీ నేతలు సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement