
నిధుల గోల్‌మాల్‌పై డీఎల్‌పీఓ విచారణ
సీతారామపురం: మండలంలో విధులు నిర్వహిస్తూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన ఓ ఎంపీడీఓ రూ.11 లక్షలకు పైగా నిధులను స్వాహా చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 2న ‘సాక్షి’లో ‘నిధుల గోల్‌మాల్’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన జెడ్పీ సీఈఓ మోహన్‌రావు ఆత్మకూరు డీఎల్‌పీఓ టి.రమణయ్యను విచారణ అధికారిగా నియమించారు. ఆయన బుధవారం సీతారామపురం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి నిధుల గోల్‌మాల్‌పై విచారణ చేపట్టారు. నిధులకు సంబంధించి జరిపిన బ్యాంకు లావాదేవీల స్టేట్‌మెంట్‌ను పరిశీలించారు. బిల్లులు, ఓచర్లు, ఎవరితో నగదు డ్రా చేయించారు తదితర విషయాలతోపాటు, కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలపై కూడా ఆరా తీసి సమగ్ర వివరాలు సేకరించారు. తుది నివేదికను జెడ్పీ సీఈఓకు అందిస్తామన్నారు. అనంతరం అయ్యవారిపల్లి, బసినేనిపల్లి సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఆయనతోపాటు ఎంపీడీఓ సాయిప్రసాద్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

నిధుల గోల్‌మాల్‌పై డీఎల్‌పీఓ విచారణ