
కల్వర్టును ఢీకొన్న బొలెరో
● దంపతుల దుర్మరణం
● ప్రాణాలతో బయటపడిన చిన్నారులు
● తెలంగాణలోని జనగామ జిల్లాలో ఘటన
లింగాలఘణపురం: బొలెరో అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో దంపతులు మృతి చెందగా, ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడిన ఘటన జనగామ – సూర్యాపేట జాతీయ రహదారి 365పై జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం వడిచర్ల సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రావణ్‌కుమార్ వివరాల మేరకు.. నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలం వడ్లపూడికి చెందిన దద్దోజు సురేశ్ (35), దివ్య దంపతులు (32), కుమారుడు మోక్షజ్ఞ, కుమార్తె లోక్షణతో కలిసి స్వగ్రామం నుంచి బొలెరోలో తాను పని చేసే కరీంనగర్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో నిద్రమత్తులో సురేశ్ డ్రైవింగ్ చేయడంతో వాహనం అదుపు తప్పి వడిచర్ల సమీపంలో కల్వర్టును ఢీకొంది. ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. పిల్లలు స్వల్పంగా గాయపడటంతో 108లో జనగామ ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కరీంనగర్‌లోని ఓ గ్రానైట్ కంపెనీలో సురేశ్ పనిచేస్తున్నారని సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించగా, ఏమి జరిగిందో తెలియని స్థితిలో ఉన్న ఆ చిన్నారులను చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. విషయాన్ని చెప్పలేక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్సను అందిస్తున్నారు.

కల్వర్టును ఢీకొన్న బొలెరో

కల్వర్టును ఢీకొన్న బొలెరో

కల్వర్టును ఢీకొన్న బొలెరో