
అక్రమంగా హౌసింగ్ స్టీల్ తరలింపు
దుత్తలూరు: దుత్తలూరు హౌసింగ్ బోర్డు గోదాము వద్ద ఉన్న హౌసింగ్‌కు సంబంధించిన స్టీల్‌ను సొంత శాఖ వారే అక్రమంగా తరలిస్తూ బుధవారం పట్టుబడ్డారు. వివరాలు.. గృహ నిర్మాణాలకు ఉపయోగించే స్టీల్‌ను స్థానిక ఏసీ కాలనీ సమీపంలోని హౌసింగ్ గోదాము వద్ద ఓ వాహనంలో లోడ్ చేస్తుండగా, అనుమానమొచ్చిన స్థానికులు వారిని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఫొటోలు తీసి హౌసింగ్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు వారు సమాచారమివ్వడంతో పరిసర మండలాల పీఎస్‌లకు తెలియజేశారు. సీతారామపురం మండలం పోలంగారిపల్లి వద్ద వాహనాన్ని గుర్తించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్టీల్‌తో పాటు వాహనాన్ని దుత్తలూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై హౌసింగ్ ఏఈ ఫిర్యాదు చేశారు. ఉదయగిరి మండలానికి చెందిన హౌసింగ్ అధికారి తన వాహనాన్ని బాడుగకు పిలిచారని, ఈ కారణంగానే వచ్చానని విచారణలో డ్రైవర్ తెలిపారు. సుమారు 900 కిలోల బరువుండి.. రూ.55 వేల విలువజేసే స్టీల్‌ను తరలించేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న హౌసింగ్ ఈఈ నారాయణరెడ్డి, డీఈ పీరాన్ దుత్తలూరుకు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించి స్థానిక అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. కాగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిపై శాఖాపరంగా విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని ఈఈ తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.