
కూటమి నేతలకు 30 యాక్ట్ వర్తించదా?
● కరేడు రైతుల మండిపాటు
ఉలవపాడు: కూటమి నేతలకు, కార్యకర్తలకు పోలీస్ 30 యాక్ట్, 144 సెక్షన్లు వర్తించవా? అని కరేడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరేడు ర్యాంపు నుంచి కరేడు మీదుగా చేవూరు వరకు రూ.2.45 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు మంగళవారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. సాధారణంగా శంకుస్థాపనను రోడ్డు మొదలయ్యే చోట ఏర్పాటు చేస్తారు. అలా కాకుండా కరేడు వద్ద చేశారు. ఊరిలో ఈనెల 31 వరకు పోలీస్ 30 యాక్ట్ ఉందని, బయట వ్యక్తులు రాకూడదని, 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు చ ఎప్పారు. అయితే ఈ కార్యక్రమానికి బయటి నుంచి వ్యక్తులు వచ్చినా చూస్తూ ఉండటంతో ఆంతర్యమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. భూములు కోల్పోతున్న వారికి అండగా వివిధ పా ర్టీల నాయకులు వస్తుంటే పోలీస్ శాఖ అడ్డుకుని అరెస్టు చేస్తూ నిర్బంధించింది. టీడీపీ కార్యకర్తలకు ఒక న్యాయం, రైతులకు ఒక న్యాయమా అని ఉద్యమ నాయకుడు, 139 బీసీ కులాల జెఏసీ చైర్మన్ మిరియం శ్రీనివాసులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా ఎమ్మెల్యే కరేడు, అలగాయపాళెం సచివాయాలను తనిఖీ చేసిన సమయంలో టీడీపీ కార్యకర్తలకే పనిచేయాలని సిబ్బందికి చెప్పినట్లు సమాచారం.