
టూరిజం భవనాల పరిశీలన
ఉదయగిరి: పట్టణంలోని ఆనకట్ట సమీపంలో నిర్మించిన ఏపీ టూరిజం శాఖ భవనాలను జిల్లా పర్యాటక శాఖ మేనేజర్ ఉషశ్రీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటక శాఖకు సంబంధించిన భవనాలను ఇటీవల టెండర్ ద్వారా అద్దె ప్రాతిపదికన ఎన్.తులసీరామ్ అనే వ్యక్తికి అప్పగించామన్నారు. దీంతో భవనాల మరమ్మతు పనులు ఎంతమేర జరిగాయో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు వచ్చినట్లు వివరించారు. పనులు పూర్తయిన వెంటనే ఆయా భవనాల్లో అతిథి గృహం, రెస్టారెంట్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అప్పాజీ, ఎకై ్సజ్ ఎస్సై శ్రీనివాసులు పాల్గొన్నారు.