29 నుంచి ఐటీఐల్లో మూడో విడత కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

29 నుంచి ఐటీఐల్లో మూడో విడత కౌన్సెలింగ్‌

Aug 21 2025 9:26 AM | Updated on Aug 21 2025 9:26 AM

29 ను

29 నుంచి ఐటీఐల్లో మూడో విడత కౌన్సెలింగ్‌

నెల్లూరు (టౌన్‌): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 29న ప్రభుత్వ, 30న ప్రైవేట్‌ ఐటీఐల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఐటీఐ కళాశాలల కన్వీనర్‌ శ్రీధర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో చేరేందుకు ఆసక్తి ఉన్న వారు ఈ నెల 26వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అడ్మిషన్లకు హాజరయ్యే వారు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఈ నెల 27వ తేదీలోపు ఏదైనా ఐటీఐలో సర్టిఫికెట్లు ధ్రువీకరణ చేయించుకోవాలన్నారు. వివరాలకు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐని సంప్రదించాలన్నారు.

విద్యార్థిని మృతిపై

ఫోర్‌ మెన్‌ కమిటీ నియామకం

విచారించి వారంలో నివేదిక

ఇవ్వాలన్న కలెక్టర్‌

నెల్లూరు (టౌన్‌): నగరంలోని అన్నమయ్య సర్కిల్‌లో ఉన్న ఆర్‌ఎన్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థిని హేమశ్రీ ఆత్మహత్య ఘటనపై ఎట్టకేలకు జిల్లా యంత్రాంగం స్పందించింది. విద్యార్థిని మృతిపై విచారించి నివేదిక అందించాలని కలెక్టర్‌ ఆనంద్‌ బుధవారం ఫోర్‌మెన్‌ కమిటీని నియమించారు. ఏపీ మైక్రో ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ (ఎంఐసీ) పీడీ, బీసీ కార్పొరేషన్‌ జిల్లా అధికారి, డీఈఓ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులను కమిటీలో సభ్యులుగా నియమించారు. విద్యార్థినీ హేమశ్రీ మృతిపై సమగ్ర విచారణ చేపట్టి వారంలోగా పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

‘సాక్షి’ కథనంపై సుమోటోగా

తీసుకున్న హైకోర్టు

ఆర్‌ఎన్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థినీ హేమశ్రీ మృతిపై ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని రాష్ట్ర హైకోర్టు సుమోటోగా తీసుకున్నట్లు తెలిసింది. విద్యార్థినీ మృతిపై రాష్ట్ర ఇంటర్‌ బోర్డు, జిల్లా శిశు సంక్షేమ శాఖ, లోక్‌ అదాలత్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ శాఖల అధికారులకు నోటీసులు జారీ చేశారు. అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వీడియోల సాక్ష్యాలను అందజేయాలని ఆదేశించినట్లు సమాచారం.

సీతారామపురం

తహసీల్దార్‌ సస్పెన్షన్‌

సీతారామపురం : సీతారామపురం తహసీల్దార్‌ పీవీ కృష్ణారెడ్డి సస్పెండ్‌ చేస్తూ జిల్లా అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీతారామపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 68–5లోని సమస్యాత్మకమైన 0.40 సెంట్ల భూమిని నిబంధనలకు విరుద్ధంగా మ్యుటేషన్‌ చేశారనే ఆరోపణపై కలెక్టర్‌ విచారణ జరిపి తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేసినట్లు సమాచారం. సదరు సర్వే నంబర్‌ 68–5లో తోట నరసింహులుకు చెందిన 0.81 సెంట్ల భూమి కోసం అతని సంబంధీకులైన ఇరువర్గాల వారి మధ్య కొంత కాలం నుంచి విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌ నిబంధనలకు విరుద్ధంగా మ్యుటేషన్‌ చేశారని ఆరోపిస్తూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఐదుగురిపై కేసు నమోదు

కావలి (జలదంకి): జలదంకి మండలం అన్నవరం క్వారీ వద్ద డ్రోన్‌తో విజువల్స్‌ తీస్తూ కావలి ఎమ్మెల్యేపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారనే కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు కావలి డీఎస్పీ శ్రీధర్‌ వెల్లడించారు. బుధవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇస్కారపు వేణు, గోళ్ల వినోద్‌కుమార్‌, దామెర్ల శ్రావణ్‌కుమార్‌, ఆత్మకూరు రాజేష్‌, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డికి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డికి రాజకీయ శత్రుత్వం ఉంది. దీంతో కృష్ణారెడ్డిని హతమార్చాలని ఏ5 ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏ1, ఏ2, ఏ3, ఏ4 నిందితులు అన్నవరం క్వారీ వద్ద ఎమ్మెల్యే రాకను గమనించి అంతమొందించాలని డ్రోన్‌తో పరిశీలిస్తుండగా క్రషర్‌లో పని చేసే ఏడుకొండలతో పాటు సిబ్బంది డ్రోన్‌ను పసిగట్టి అడ్డుకున్నారు. దీంతో నలుగురు నిందితులు క్రషర్‌ సిబ్బందిపై కత్తులు, రాళ్లతో దాడులు చేసి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. జలదంకి ఎస్సై లతీపున్నీసా ఏ1, ఏ2 నిందితులైన వేణు, వినోద్‌లను బుధవారం ఉదయం 10 గంటల సమయంలో జమ్మలపాళెం వద్ద అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

29 నుంచి ఐటీఐల్లో మూడో విడత కౌన్సెలింగ్‌ 1
1/1

29 నుంచి ఐటీఐల్లో మూడో విడత కౌన్సెలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement