WI Vs Ind 2023: Cricket West Indies Announces 18 Member Squad For Test Camp, Names Inside - Sakshi
Sakshi News home page

WI Vs Ind 2023: టీమిండియాతో టెస్టులకు సిద్ధం.. కెప్టెన్‌గా బ్రాత్‌వైట్‌.. వాళ్లంతా జట్టుకు దూరం!

Jun 30 2023 9:02 AM | Updated on Jun 30 2023 10:30 AM

WI Vs Ind 2023: West Indies Announce 18 Member Squad For Test Camp - Sakshi

West Indies Vs India 2023: టీమిండియాతో టెస్టులకు వెస్టిండీస్‌ జట్టు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం 18 మంది సభ్యులతో కూడిన సన్నాహక జట్టును ప్రకటించింది. ఈ మేరకు క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ సారథ్యంలోని విండీస్‌ శుక్రవారం(జూన్‌ 30) నుంచి ప్రిపరేషన్‌ క్యాంపులో బిజీ కానుంది.

ఆంటిగ్వాలోని కూలిడ్జ్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ మొదలుపెట్టనుంది. కాగా ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2023 క్వాలిఫయర్స్‌తో వెస్టిండీస్‌ పరిమిత ఓవర్ల జట్టు ప్రస్తుతం బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సూపర్‌ సిక్స్‌కు అర్హత సాధించిన విండీస్‌.. ప్రధాన టోర్నీలో అడుగుపెట్టాలంటే మరికొన్ని మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

నెలరోజులు బిజీ
ఇదిలా ఉంటే.. జూలై 12- ఆగష్టు 13 వరకు టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విండీస్‌ పర్యటనను రోహిత్‌ సేన టెస్టు సిరీస్‌తో మొదలుపెట్టనుంది.

ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించగా.. వెస్టిండీస్‌ శుక్రవారం 18 మంది సభ్యులతో కూడిన సన్నాహక జట్టును ప్రకటించింది. ఇక వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌తో బిజీగా ఉన్న జేసన్‌ హోల్డర్‌, నికోలస్‌ పూరన్‌, రోస్టన్‌ చేస్‌, కైలీ మేయర్స్‌, అల్జారీ జోసెఫ్‌ తదితరులకు ఇందులో చోటు దక్కలేదు.

వాళ్లంతా దూరం
వీళ్లంతా జూలై 12న మొదలు కానున్న మొదటి టెస్టు సమయానికి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా క్వాలిఫయర్స్‌లో భాగంగా వెస్టిండీస్ సూపర్‌ సిక్స్‌ దశలో తమ ఆఖరి మ్యాచ్‌ను జూలై 7న ఆడనుంది. ఒకవేళ అన్నీ కుదిరితే జూలై 9 నాటి ఫైనల్‌కు చేరితే.. పూరన్‌, హోల్డర్‌ తదితరులు స్వదేశానికి రావడం మరింత ఆలస్యం కానుంది.

క్వాలిఫయర్స్‌కు ఆతిథ్య ఇస్తున్న జింబాబ్వే నుంచి డొమినికాకు విమానాలు పరిమిత సంఖ్యలో ఉండటమే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే.. బ్రాత్‌వెస్ట్‌ నేతృత్వంలోని టెస్టు స్పెషలిస్టులంతా  జూలై 9నే డొమినికాకు చేరుకోనున్నారు.

వెస్టిండీస్ జట్టు: 
క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్వుడ్, ఎన్క్రుమా బోనర్, తగెనరైన్ చంద్రపాల్, రఖీమ్ కార్న్వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డాన్, జైర్ మెక్అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్.

చదవండి: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌.. వెస్టిండీస్‌ కీలక నిర్ణయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement