విరాట్‌ కోహ్లికి ఏమైంది..? మరోసారి ప్రాక్టీస్‌ డుమ్మా! | Virat Kohli skips T20 World Cup practice again: Reports | Sakshi
Sakshi News home page

T20 WC: విరాట్‌ కోహ్లికి ఏమైంది..? మరోసారి ప్రాక్టీస్‌ డుమ్మా!

Published Mon, Jun 3 2024 11:05 AM | Last Updated on Mon, Jun 3 2024 11:23 AM

Virat Kohli skips T20 World Cup practice again: Reports

టీ20 వరల్డ్‌కప్‌-2024 టోర్నీని ఘనంగా ఆరంభించేందుకు టీమిండియా అన్ని విధాల సన్నద్దమవుతోంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో జూన్‌ 5న న్యూయర్క్‌ వేదికగా తలపడనుంది. 

ఇప్పటికే న్యూయర్క్‌ చేరుకున్న రోహిత్‌ సేన ప్రాక్టీస్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. టీమిండియా సోమవారం(జూన్‌ 3) తమ చివరి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గోనుంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు(జూన్‌ 4)న ఆటగాళ్లకు టీమ్‌ మెన్‌జ్‌మెంట్‌ విశ్రాంతి ఇవ్వన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం వీలైనంత ఎక్కువ సమయం పాటు నెట్స్‌లో గడపాలని భారత జట్టు భావిస్తున్నట్లు సమాచారం.

కోహ్లి ప్రాక్టీస్‌ డుమ్మా!
ఇక జట్టుతో కాకుండా కాస్త ఆలస్యంగా అమెరికాకు చేరుకున్న టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి ఇప్పటివరకు ఒక్క ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గోనలేదు. జూన్‌ 1న బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మాప్‌ మ్యాచ్‌కు దూరమైన కోహ్లి.. ఆదివారం(జూన్‌ 2)న ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గోంటుడని పలు రిపోర్ట్‌లు పేర్కొన్నాయి. 

కానీ ఆదివారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌కు కూడా కోహ్లి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. జట్టుతో కలిసినప్పటికి అతడు ఇంకా విశ్రాంతి తీసుకుంటున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. విరాట్‌ సోమవారం జట్టు ఆఖరి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గోనే అవకాశం ఉంది. 

కాగా ఐపీఎల్‌-2024లో ఎలిమినేటర్‌లో ఓటమి తర్వాత కోహ్లి రెస్టులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా విరాట్‌ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌-2024లో కోహ్లి దుమ్మలేపాడు.  ఈ ఏడాది సీజ‌న్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన విరాట్‌.. 61.75 స‌గ‌టుతో 741 ప‌రుగులు చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ హోల్డ‌ర్‌గా విరాట్ నిలిచాడు. ఇదే ఫామ్‌ను టీ20 వరల్డ్‌కప్‌లోనూ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement